TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
మనిషి-భాష-పని
- Site Administrator
< < Previous   Page: 2 of 3   Next > >  
కాళ్ళు పోతే సాంతేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన కృత్తిమ కాళ్ళు అమర్చి మనిషిని నడిపించవచ్చు. కాని, చేతులు పోతే? ఒకవేళ కృత్తిమ చేతులను అమర్చినా, అవి సహజ చేతుల్లాగా పని చేసి ఇంతటి అందమైన వస్తువులను తయారు చేయగలమా? కాళ్ళు పోయిన వ్యక్తి కొన్ని కాలాలపాటు బ్రతకవచ్చు. చేతులు పోయిన మనిషి ఏదో విధంగా బ్రతుకీడ్చవచ్చు. కాని కాళ్ళు చేతులు రెండూ పోగొట్టుకున్న వ్యక్తి? సుదీర్ఘ మానవ నాగరికచరిత్రకు సజీవ సాక్షాలు ఈ చేతులేనని ఓ చరిచ్రకారుడన్నాడు. విరిగిన తరువాత కాలు విలువ తెలుసుకున్న ఓ ప్రముఖ కవి పొద్దున లేచి దేవునికి కాదు దండం పెట్టాల్సింది కాళ్ళకు అన్నాడు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కాళ్ళు చేతులను పోగొట్టుకుంటే చరిత్రకారుడు చెప్పినట్లు చరిత్రనేకాదు, మనిషి భాషను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి దుస్థితే రాములుకు ఏర్పడింది. కాళ్ళెలా పోగొట్టుకున్నావని రాములును అడిగాను. అతను ఇలా చెప్పాడు. ఎట్లైందో ఇప్పుడు నాక్కూడా యాదికి లేదు సారు. నేను పేదోన్ని. పని చేసుకుంటేనే పూటగడుస్తది. నాలుగేండ్ల కిందట ఏదైనా పనిమీదే పోయిన్నో, లేక పని చూసుకోవడానికే పోయిన్నో తెలవదు. కాజీపేటకో, స్టేషన్ ఘణపూర్ కో పోయిన. రెండు మూడు రోజులు ఉపవాసంతోటి ఉన్న. చక్కర్ వచ్చి రైలు పట్టామీద పడిపోయిన. త్వారత ఏమైందో కాని నేను యంజి.ఎం.హాస్పటల్ల ఉన్న. డాక్టర్లు రెండు కాళ్ళు తీసేసిర్రు. నాలుగు నెల్లు అయినంక పని చేసుకుని బతికిన జనమగామలోనే ఈ చేయితోటి అడుకుంటాన్న అంటూ రాములు ఏడ్చాడు. కుడి చేయి ఎట్లా పోయిందని అడిగితే 'రెండేళ్ల కింద మున్సిపాలిటి ఆఫీసు వేపచెట్టు కింది పడుకుని వున్న. గ్రహచారమో ఏమో కాని వేప మండ ఇరిగి కుడిచేయి మీద పడ్డది. చేయి నుజ్జునుజ్జయింది. జనగామ హాస్పిటల్ కు తీసుకుపోయిర్రు. ఆన్నించి యం.జి.ఎం.తీసుకుపోయిండ్రు. డాక్టర్లు చేయిని తీసేసిర్రు. అప్పట్నుండి ఎడమ చేయి ఒక్కటే నాకు దిక్కైయితాంది' అన్నాడు. నీ భార్య, పిల్లలు, చుట్టాలు, పక్కాలు నిన్ను కలుస్తారా, మాట్లాడతారా అన్న ప్రశ్నకు రాములు ఇలా జవాబు చెప్పాడు. 'నాభార్యకు మెంటల్. ఎప్పుడో ఒకసారి వస్తది. పెద్దకొడుకు చదువుకోకుండ గాలి గాలి తిరుగుతాండు. నా దగ్గరికి ఎప్పుడూ రాడు. చిన్నకొడుకు చిన్నపిల్లగాడు గద సారూ, వాడు వచ్చిపోతడు' అంటూ రాములు ఇంకా ఇలా చెప్పసాగాడు. 'నాకు చుట్టాలు, పక్కాలు ఎవరూ లేరు. బావమరుదులు వున్నారు కాని నాదగ్గరికి రారు. నా దగ్గర ఏముందని వస్తరు. నా దగ్గర పైసలు లేవు. పైసలున్నా వచ్చేవాళ్ళేమో. కాళ్ళుచేతులు పోగొట్టుకున్నోన్ని దగ్గరికి ఎవరొస్తారు' అన్నాడు. ఎట్లా అడుక్కుంటావు, అడుక్కోవడానికి ఏ పదం వాడతావు అని అడిగాను. రాములు ఇట్లా చెప్పాడు. 'జనగామలో చాలా ఏండ్ల నుండి ఉంటాన, నాకు తెలిసిన వాళ్ళు రూపాయో, ఆటాన్నో ఏసిపోతారు. 'అయ్యా! ఒక రూపాయుంటే ఏయి. అమ్మా! ఒకరూపాయుంటే ఏయి. మీకు పుణ్యం ఉంటది. మీ పిల్లలు సల్లగుంటరు' అని అడుక్కుంటాను. దయగల వాళ్ళు ఏస్తరు. లేకపోతే లేదు. అడుక్కోవడానికి మనసు చంపుకోవాలె సారు... కళ్ళు పోయినా బాగుండు. కాని కాళ్ళు చేతులు పోవద్దు. కళ్ళు పోయినవాళ్ళు పదిచోట్లకు తిరిగి పదిమందిని అడుక్కుంటారు. భాష అడుక్కునేదే అయిన పదిమందితోని మాట్లాడుతారు. పాడేటోళ్ళు పాటలు పాడుతారు. అట్ల వాళ్ళకు కాలం ఎల్తది. కళ్ళు లేనినోళ్లని వాళ్ళకు పైసలు ఏస్తరు.

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 3   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.