|
|
Articles: TP Features | 'స్విస్' గుట్టు విప్పేనా? - Site Administrator
| |
ఎక్కడి నుంచి, ఎలా వచ్చింది అనే వివరాల జోలికి పోకుండా, మూడో కంటి వానకి తెలియకుండా గోప్యత కాపాడుతామనే షరతుమీద దేశదేశాలలోని అక్రమార్జనాపరుల వద్ద గల ధనాన్ని స్వీకరిచి ఉంచే బ్యాంకింగ్ వ్యాపారంలో స్విట్జర్లాండ్ బ్యాంకులు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. మన దేశంలో అధికారం ద్వారా, వ్యాపార లావాదేవీలు, కమిషన్ల ద్వారా చట్టం అనుమతించే హద్దుదాటి పోయి అపారంగా ఆర్జించిన రాజకీయ నాయకులు, పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులు వేలు, లక్షల కోట్ల రూపాయల మేరకు తమ గుప్త ధనాన్ని చిరకాలంగా స్విస్ బ్యాంకుల సురక్షిత ఖాతాలకు మళ్ళిస్తున్నారు. అలాగే ఆ డబ్బుతో ఇతర మరి పెక్కు దేశాలలో విలువైన ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అటువంటి సొమ్ము పాతిక లక్షల నుంచి డెబ్భై లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అద్వానీ అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ డబ్బునంతటినీ రప్పించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తామంటున్నారు. ఆయన అంత పనిచేస్తానంటే హర్షించని వారెవరు? అయితే అది అంత సులభమా? ఈ ప్రశ్నకు అవునని సునాయాసంగా సమాధానం చెప్పడం కష్టం.
స్విస్ బ్యాంకు ఖాతాల మూతలు అంత తొందరగా తెరుచుకునేవి కావు. ఆ డబ్బు ఎన్నెన్ని రూపాలలో ఎక్కడెక్కడికి తరలిపోయి ఉన్నదో దాని పై వస్తున్న రాబడి ఎన్నెన్ని పిల్లను, పిల్లాది పిల్లలను కంటున్నదో తెలుసుకోవడమూ సులభతరం కాదు. స్విస్ బ్యాంకులలో అతి పెద్దదైన యుబిఎస్ బ్యాంకు అమెరికన్లు స్వదేశంలో పన్నులు కట్టకుండా తరలించిన అక్రమ ధనరాశులకు ఖాతాలు తెరిచినందుకుగాను అమెరికా ప్రభుత్వానికి 780 మిలియన్ డాలర్ల జుర్మానా చెల్లించుకోవలసి వచ్చింది.
అమెరికా ప్రభుత్వ రాబడి పన్ను వ్యవస్థ కన్నుగప్పి వచ్చిన ఆ సొమ్ముకు ఉద్దేశపూరితంగా, కుట్రపూరిత వ్యూహంతో తాము ఆశ్రయమిచ్చామని ఆ బ్యాంకు అంగీకరించింది. అటువంటి అమెరికన్ల స్విస్ బ్యాంకు ఖాతాలు 19000 మేరకు ఉండగలవని ఒబామా ప్రభుత్వం భావిస్తున్నది. ఆ ఖాతాదార్లందరి పేర్లు బయటకు రప్పించాలని ప్రయత్నిస్తున్నది. అయితే అంతిమంగా యుబిఎస్ మహా అయితే కొద్ది వందలమంది అటువంటి ఖాతాదార్ల పేర్లను బయటపెట్టవచ్చనీ అంతకుమించి స్విస్ బ్యాంకు ఖాతాల బండారం బయటపడే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|