|
|
Articles: TP Features | లెక్క తేల్చేది కులాలే! - Site Administrator
| |
ఇన్ని ప్లస్, మైనస్ ల మధ్య కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే వారు ఎవరని యోచిస్తే.. నిస్సందేహంగా మెజారిటీ రెడ్డి కులస్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. మొదటిసారి ఎస్సీ ఓట్లు చీలుతున్నాయి. మాదిగల ఓట్లు దాదాపుగా కాంగ్రెస్ కు పడటం లేదు. గతంలో పడినట్లుగా ముస్లీం ఓట్లు ఎక్కువగా పడకపోవచ్చు. 'సామాజిక న్యాయం' అనే నినాదం కనుక పనిచేస్తే బీసీ కులస్థులు అభ్యర్థులుగా లేని చోట బీసీల ఓట్లు బాగా చీలుతాయి. వారి కుల అభ్యర్థి లేని చోట కమ్మవారు కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా వేయరు. అలాగే కాపులు, బలిజలు కూడా. ఈసారి సీమలో ఒక్క బలిజకు కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వక కొంత పొరపాటు చేసింది. రాజశేఖరరెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్దిపొందిన వారిలో ఇతర పార్టీల వారు, కులాల వారు ఎందరో ఉన్నారు. వారు కృతజ్ఞత పూర్వకంగా ఓట్లు వేయకపోవచ్చు. లబ్ది పొందేటప్పుడు పోట్లాడిన వ్యక్తి ఓటు వేసేటప్పుడు మాత్రం తన కులం, తన పార్టీ, ఎగస్పార్టీ, స్థానిక వైరాలు ఇత్యాది అంశాలను పట్టించుకుంటాడు.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు వోటు వేసినందువల్ల ప్రజలకు కాంగ్రెస్ కొత్తగా ఏమీ ఇస్తానని చెప్పలేదు. కానీ, తెలుగుదేశం పార్టీ కలర్ టీవి, మనీ ట్రాన్స్ ఫర్ స్కీం, నిరుద్యోగ భృతి లాంటి హామీలు ఇచ్చింది. పెడతాను అంటే ఆశ, కొడతాను అంటే భయం సహజంగానే ప్రతివారికీ ఉంటుంది. ఈ ఆశవల్ల కొన్ని సాధారణ జనం ఓట్లు మహా కూటమికి పడే అవకాశం ఉంది. ఈ రాజకీయ కూడికలు, తీసివేతలు ఇలా ఉండగా ఓటరు మాత్రం గుంభనంగా పరిస్థితిని గమనిస్తున్నాడు. ఓటరు మనస్సులో ఉన్న దాన్ని కనిపెట్టేశామని అంటూ మిడిమిడి శాస్త్రీయ సర్వే సంస్థలు బయలుదేరి... ఎవరు డబ్బు ఇస్తే వారే గెలుస్తున్నారంటూ ప్రకటనలు చేస్తున్నారు.
రకరకాల సర్వేలు జరుగుతున్నాయి. వాటికి శాస్త్రీయత, విశ్వసనీయత రెండూ లేవు, సందర్భం కూడా లేదు. ఎవరు డబ్బు ఇచ్చి సర్వే చేయమంటే వారికి అనుకూలంగా ఫలితాలను మార్చి ప్రకటిస్తున్నారు. అలాంటి సర్వేల్లో కూడా ఫలితాలు మారుతూనే ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ సానుకూలమైన మెజార్టీ సాధిస్తుంది అన్న వారు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 147కు 15-20 స్థానాలు తగ్గుతాయి... ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా నిలుస్తుంది అంటున్నారు. ఇంకో సర్వే 120 స్థానాలని మరో సర్వే 97 స్థానాలని వెల్లడించాయి. మరో పేరున్న సంస్థ 190 స్థానాలు వస్తాయని చెప్పింది అయినా ఇవేవి వాస్తవ స్థితిని వెల్లడించవు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|