|
|
Articles: TP Features | అమ్మకానికి వార్తలు! - Site Administrator
| |
'విక్టరీ దిశగా బుగ్గారావు పరుగు',
'సికింద్రాబాద్ లో దూసుకు పోతున్న సైకిల్',
'భీంసేన్ వైపే మల్కాజిగిరి సెటిలర్లు',
'ఎల్ బీ నగర్ లో దూసుకుపోతున్న శ్రవణ్',
'జననేత అంజన్నకు అడుగడుగునా నీరజనాలు',
'ప్రచారంలో దూసుకుపోతున్న బద్దం బాల్ రెడ్డి
ఇవన్నీ ఒక ప్రముఖ దినపత్రిక హైదరాబాద్ టాబ్లాయిడ్ లోఒకే రోజు వచ్చిన వార్తల శీర్షికలు. ఇక రాష్ట్రంలోనే అత్యధిక సర్కులేషన్ గల పత్రికగా పేరొందిన మరో దినపత్రిక హైదరాబాద్ టాబ్లాయిడ్ లోని కార్వాన్ జోనల్ పేజీలో ఒక అభ్యర్థితో ప్యాకేజి కుదుర్చుకుంది. 'ప్రజలను ఆకట్టుకుంటున్న రూప్ సింగ్ పాదయాత్రలు' రూప్ సింగ్ కు, జన నీరా'జనం', కార్వాన్ లో గెలుపు ఖాయం : రూప్ సింగ్ పేరుతో సగం పేజీ చొప్పున పెయిడ్ ఆర్టికల్స్ వచ్చాయి. ఇక ఇటీవల ప్రారంభమైన దినపత్రిక కూడా దీనికి అతీతం కాదు. ఆ పత్రికలోనూ 'పెయిడ్ ఆర్టికల్స్' వస్తున్నాయి. ఇలాంటి ఆర్టికల్స్ తేవాలంటూ విలేకరులపై ఒత్తిడి తెస్తోంది.
వార్తల స్థానంలో ఇలాంటి అడ్వర్టయిజ్ మెంట్లను చొప్పించడం సమంజసమేనని పత్రికల యాజమాన్యాలు ఎలా భావిస్తున్నాయి? వాస్తవ పరిస్థితికి అద్దం పట్టని ఇలాంటి 'వార్తలు' ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపవా? నిబంధనాల ప్రకారం లక్షల్లో మాత్రమే ఖర్చు పెట్టాల్సిన పార్టీలు కోట్లు కుమ్మరించి జనాన్ని తమవైపు తిప్పుకోవడానికి దొడ్డిదారిన డబ్బు ఖర్చు చేసే ఇలాంటి పద్ధతులు 'ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్' కిందికి రావా? ఒక వేళ వస్తే అందులో పత్రికా యాజమాన్యాల వాటా ఉన్నాట్టా? లేనట్టా? ఇవన్నీ పత్రికా యాజమాన్యాల నైతికతకు సంబంధించిన ప్రశ్నలు. నీతి, నియమం తప్పి ధనార్జనే ధ్యేయంగా ఇలాంటి తప్పుడు పద్దతులకు పాల్పడే పత్రికలు అనేక సందర్భాలలో, అనేక వార్తల్లో, అనేకానేక ప్రత్యక కథనాల్లో అక్రమాల గురించి రాసే నైతికత ఉంటుందా?
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపు అన్ని 'ప్రధాన' పత్రికలు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఒక నియోజక వర్గంలో బలమైన అభ్యర్థికి విజయావకాశాలు ఉంటే వాస్తవికత ఆధారంగా అలా రాస్తే తప్పు లేదు. కానీ ఏమాత్రం బలం లేని అభ్యర్థి ఇచ్చిన లక్షో, రెండు లక్షల ప్యాకేజీకి ప్రలోభ పడి అతడు విజయ పధంలో కొనసాగుతున్నాడనీ, జనం అతనికి నీరాజనాలు పలుకుతున్నారనీ, అతని గెలుపు ఖాయమని రాస్తే ఆ నియోజకవర్గ ప్రజలను మనం ఏ విధంగా చైతన్యపర్చుతున్నట్టు?
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|