|
|
Articles: TP Features | నేతిబీరలా ఫిరాయింపు చట్టం - Site Administrator
| |
శాసనసభలో 294 స్థానాలున్నాయి. ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 స్థానాలైనా రావాలి. దీన్నే మ్యాజిక్ ఫిగర్ అంటున్నారు. ఒకటి రెండు స్థానాలు అధికంగా ఉంటే మరింత మంచిది. అయితే మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకీ 147 స్థానాలు వచ్చే అవకాశం లేదన్న ఊహాగానాలు సర్వత్రా వెలువడుతున్నాయి.
10వ లోక్ సభలో 12 పార్టీల వారు గ్రూపులుగా పార్టీలు ఫిరాయించారు. చట్టంలో ఉన్న చీలిక, విలీనం, 1/3 వంతు మంది, విప్ కు బద్ధులవడం, విప్ లాంటి సాంకేతిక పదాలపై చర్చను లేవనెత్తి వారు చట్టానికి చిక్కనే లేదు. తెలుగుదేశం పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, శివసేన, సమాజ్ వాది పార్టీ, ద ఇండియన్ ముస్లీం లీగ్ పార్టీ, అస్సాం గణ సంగ్రామ పరిషత్, జనతాదళ్ లాంటి 12 పార్టీల ఎం.పీలు పార్టీ ఫిరాయించారు. 528 మంది సభ్యులున్న అప్పటి అధికార పార్టీకి 251 సభ్యుల మద్దతు ఉండేది. వీరి ఫిరాయింపులతో ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 264ను దాటి 261కు చేరింది.
అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో కలిపి ఈ చట్టం వచ్చాక వందలు కాదు వేలాది ఫిరాయింపులు జరిగాయి. అతి కొద్దిమంది మాత్రమే ఈ చట్టానికి చిక్కారు. అత్యధికులు జారిపోయారు.
మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి సంవత్సరం 1948 నుంచే పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి) పట్టంతానుపిళ్లై (ట్రావన్ కోర్ ముఖ్యమంత్రి).. తొలి ఫిరాయింపులు జరిగాయి, జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాక కర్నాటకలో జరిగిన బాగోతం అందరికీ తెలిసిందే.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|