|
|
Articles: TP Features | నల్లడబ్బంతా భారత్ వస్తే.. - Venkateswara Rao Madu
| |
ఆర్.టి.సి. బస్సులో, రైల్వేబుకింగ్ కౌంటర్లో, బ్యాంకు క్యాష్ కౌంటర్లో పావలా పైసలు తేడా వస్తే తక్షణం ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసే చట్టాలున్న దేశంలో గజదొంగల కంటే పెద్ద దొంగలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షిస్తున్నాయో మరి. ఇప్పటి వరకు బ్రిటిష్ పాలకులు దేశాన్ని పరిపాలిస్తున్నా, ఇంత డబ్బును దేశం నుండి దొంగలించేవారు కాదేమో.
నల్లధనాన్ని వంద రోజులలో బైటకు తెస్తామని బిజెపి నేత ఎల్.కె.అద్వానీ హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని చిదంబరం ఖండిస్తున్నారు. నాటి ఎన్.డి.ఏ ప్రభుత్వమే విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) స్థానే, విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) తెచ్చిందని, తద్వారా విదేశీ బ్యాంకులలో ఉన్న నల్లధనం వెలికితీత పై ఎన్.డి.ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని చిదంబరం విమర్శించారు. అయితే ఫెమా చట్టాన్ని ఆనాడు చిదంబరం కూడా మెచ్చుకున్నారని బిజెపి నాయకుడు అరుణ్ శౌరి గుర్తు చేశారు. ఫెరా స్థానంలో ఫెమాను ప్రవేశపెట్టినప్పటికీ అదనంగా రెండేళ్ళపాటు ఫెరా కింద ప్రాసిక్యూషన్లకు వీలు కల్పించిందని, ఫెరా రద్దు కావడానికి ముందు దర్యాప్తును ఎదుర్కొంటున్న వారికి సంబంధించి రెండు వేల కేసులను చేశారని శౌరి అన్నారు.
విదేశీ బ్యాంకులలోని ఈ డబ్బును భారతదేశానికి తరలిస్తే, దేశంలోని నల్లడబ్బును వెలికితీస్తే ఓ యాభై ఏళ్ళపాటు దేశ పౌరులకు పైసా పన్ను వేయకుండా ప్రభుత్వాలను నడపవచ్చు. ప్రతి కుటుంబానికి సొంత ఇంటిని కట్టి ఇవ్వవచ్చు. ప్రతి కుటుంబానికి కారు ఇవ్వవచ్చు. ఆకలి చావులను పూర్తిగా నిరోధించవచ్చు. పౌరులందరికీ విద్యా, వైద్య సౌకర్యాలు పూర్తి ఉచితంగా అందించవచ్చు. వేలాది పరిశ్రమలను స్థాపించవచ్చు. వేల ప్రాజెక్టులను నిర్మించవచ్చు. మన తాతలు, తండ్రులను, మనలను వంచించి దొంగిలించిన డబ్బు అది. ఆ డబ్బును వెలికి తీసి అభివృద్ది కార్యక్రమాలకు, ప్రజాసంక్షేమానికి వినియోగించాలి. దీనికి అవసరమైతే మరో స్వతంత్ర ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలి.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|