|
|
Articles: TP Features | నవ రసాల శ్రీశ్రీ - Site Administrator
| |
1947 అక్టోబరు 26 `నవోదయ'లో `ఆగ్రహం' శీర్షికతో రాసిన శ్రీశ్రీ ఆరు పేరాల రచనలో - వచనాన్ని ఎంత ప్రతిభావంతంగా, కవితాత్మకంగా ఉపయోగించారో చూడగలం. ప్రతి పేరాను `ఆగ్రహం ఎందుకంటే' అంటూ ప్రారంభించి - ఈ విధంగా రాశారు చూడండి :
`ఆగ్రహం ఎందుకంటే అనుకున్న పని ఎప్పటికప్పుడయినట్లు కనబడుతూ కాకపోవడం వల్ల...
ఆగ్రహం ఎంచేతనంటే....
ఆగ్రహం ఎందువల్లనంటే...
ఆగ్రహం ఎందుకా...
ఆగ్రహం ఏ కారణం వల్లనంటే...
ఆగ్రహమే మరి!...'
చివరి వాక్యం `ఆగ్రహానికి కారణాలనేకం'....
చివరి పేరాలలో కారణాలు చెబుతూ, `మనం నమ్మినవాళ్ళే మన కన్నీళ్ళకు కారణమవడం, విశ్వవిద్యాలయాల, వార్తాపత్రికల వికృత విన్యాసాలు, క్షామం, నల్లబజారు, లంచగొండి రాక్షసులు-' ఇలా సమకాలీన రుగ్మతల్ని ప్రస్తావిస్తారు. కేవలం 28 పంక్తుల రచన ఇది.
1972 నాటి శ్రీశ్రీ వచనం చూడండి : `ఢంకాని జోకొట్టాలనీ, అలల్ని అరికట్టాలనీ, గాలిని ఉరితియ్యాలనీ ఇదివరకెన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి. కాని అవి ఎన్నడూ ఫలించలేదు.'
ఈ నేపథ్యం అంతా ఎందుకంటే శ్రీశ్రీ 1976 ఆగస్టు నుండి 1977 మే వరకు `జ్యోతి' మాసపత్రికలో నవరసాల పేరుతో రాసిన తొమ్మిది వాక్చిత్రాలను పరిచయం చేయడానికి. శ్రీశ్రీ వచన రచనలో సాధించిన విశిష్టత తెలియచేయడానికి. శ్రీశ్రీ రాసిన `ఋక్కులు' శీర్షికలతో రా.వి.శాస్త్రి కథలు రాయగా, అలంకారశాస్త్రంలోని నవరసాలను చిత్రిస్తూ శ్రీశ్రీ వీటిని రచించారు. చిత్రకళలో బాపు చిత్రించిన `నవరసాల చిత్రాల'కు ఎంత ప్రాముఖ్యత ఉందో, సాహిత్యంలో శ్రీశ్రీ రాసిన ఈ నవరసాల రచనలకు అంత ప్రాముఖ్యం ఉంది. శ్రీశ్రీ తన కథన శక్తినీ, కవితా శక్తినీ, సునిశిత హాస్యాన్నీ, సామాజిక స్పృహనీ, శబ్ద సౌందర్యాన్నీ - సమస్త శక్తులనూ, ఈ తొమ్మిది రచనల్లో ప్రతిభావంతంగా ప్రదర్శించారు. వీటిని వివరంగా పరిశీలిద్దాం.
మొదటిది అద్భుతరసం. శీర్షిక `లెని`నిజం'. 1980 జనవరి 2 మాస్కోలోని క్రెమ్లిస్ భవనంలో లెనిన్ సమాధి - లెనిన్ శవపేటికను కొన్ని మరమ్మతుల నిమిత్తం వేరేచోటికి తరలిస్తున్నారని వార్త. రెండు రోజుల క్రితమే రష్యన్లు సాల్యూట్ 10 అనే అంతరిక్ష పరిశోధనాగారాన్ని కక్ష్యలోకి పంపారు. దీని ఆధారంగా అమెరికన్ జర్నలిస్టులు లెనిన్ కు ప్రాణప్రతిష్ట చేసే వైద్య ప్రయోగాలు అంతరిక్ష నౌకలో జరుగుతున్నాయని ఊహాగానం చేశారు. అది నిజమేనని జనవరి 4న టాస్ ప్రకటించింది. అంటే నిజానికి లెనిన్ ను బతికించే ఉంటారని బ్రిటిష్ సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కొన్ని మత సంస్థలు ఈ ప్రయోగం దైవసంకల్పానికి విరుద్ధమన్నాయి. ఈ ప్రయోగం విఫలం కావాలని ప్రార్థనలు చేయమన్నారు. ఇదే అదనుగా ప్రదర్శనలకనీ, ప్రార్థనలకనీ, భజనలకనీ పెద్దమొత్తాలు పోగుచేసి కొందరు కైంకర్యం చేసుకున్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|