|
|
Articles: TP Features | కౌంటరేది? ఎన్ కౌంటరేది? - Site Administrator
| |
మావోయిస్టులు బంద్ కు ఏకారణం చూపారో వాటినే వారు చేయాలి కదా? మరి ఈ చర్యలకు నిరసనగా బంద్ కు ఎవరు పిలుపునివ్వాలి? ఒక మహిళా సర్పంచ్ కూడా బూటకపు ఎన్ కౌంటర్లకు బాధ్యురాలా?...
ఒక మండలాధ్యక్షుడిని, ఒక మాజీ దళ సభ్యుడిని హతమార్చడానికి వారికి ఏ విధమైన అధికారాలున్నాయి? బూటకపు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని గగ్గోలుపెడుతూ మావోయిస్టులు చేసింది అవే బూటకపు కాల్పులే కదా? అలాంటప్పుడు వారి మాటలకు మాన్యత ఎక్కడుంటుంది?
హుకుంపేట మండలాధ్యక్షుడు మొత్తం ఏ జెన్సీ ప్రాంతంలో `హుకుం' (మావోయిస్టుల మాదిరి) చెలాయించలేదు కదా? మాజీ దళ సభ్యుడు సైన్యాన్ని ఏర్పాటుచేసి ఇష్టానుసారం హత్యలకు, దోపిడీలకు, దొమ్మీలకు పాల్పడలేదు కదా? మరి వారెందుకు హత్యలకు గురికావాలి?
బూటకపు ఎన్ కౌంటర్లపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాట్లాడే మానవ హక్కుల నాయకులుంటారు. ఆదివాసీలకు అన్యాయం జరిగిపోతోందని గుండెలు బాదుకునే వారున్నారు. జాతీయ - అంతర్జాతీయ హక్కుల సంఘాలు కదిలి వందల గంటల పాటు అదే పనిగా ఆందోళనలు చేస్తారు. రీముల కొద్దీ తమ అభిప్రాయాలను పత్రికల్లో ప్రకటిస్తారు. మరి హుకుంపేట మండలాధ్యక్షుడు, మాజీ దళ సభ్యుడు (ఏజెన్సీలో ఉన్నవారు) మావోయిస్టుల తుపాకులకు బలవుతూ బూటకపు ఎన్ కౌంటర్లకు ఎలా స్పందించాలో అలాగే స్పందించాలి కదా? మండలాధ్యక్షుడు గాని, మాజీ దళ సభ్యుడు గాని మావోయిస్టుల ప్రధాన శత్రువు కాదు. ఆధునిక ఆయుధాలు కలిగి అపాయం కలిగించే స్థితిలో వారు లేరు. మరి ఎందుకు వారిని హతమార్చాలి? ఇవి బూటకపు హత్యలు కావా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఇది ఆదివాసీల హక్కుల హననం కాదా? బతికే హక్కును లాక్కోవడం కాదా?... ఇది ఏ రకంగా 'విప్లవాత్మక సంఘటనో' హక్కుల సంఘాల వాళ్ళు సమాజానికి, సంఘానికి వివరిస్తే మరోసారి ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు తిరిగి ఎవరూ ఆ ప్రశ్న వేయడానికి అవకాశం ఉండదు.
మావోయిస్టులను ఎవరూ ప్రశ్నించకూడదు. వారు ఏమి చేసినా ధర్మబద్ధం, న్యాయబద్ధం, అత్యున్నత ఆదర్శవంతం అని వారికి కితాబునిచ్చే విద్యావంతులు, వివేకవంతులు, వివేచనాపరులు, ఇలాంటి సంఘటనలపై స్వల్ప సమయం వెచ్చించి అవి ఎలా ఆదర్శప్రాయమైన సంఘటనలో, హత్యలో అత్యున్నత మానవాంశ ఆ చర్యల్లో దాగి ఉందో వివరిస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|