|
|
Articles: TP Features | అలెగ్జాండరే కుమారస్వామి! - Site Administrator
| |
- అరబ్బులు అలెగ్జాండర్ ని ISKANADER dHU'LQUANEEN పేరుతో ఒక దేవుడిగా కొలుస్తారు. రెండు కొమ్ముల దేవుడని ఈ పదానికి అర్థం. ఇస్లామ్ ఈ `ఇస్కందర్'ని (సికిందర్) తమ మతప్రవక్తల (PROPHET)లో ఒకరిగా గౌరవించింది.
- భారతదేశంలోకి ఇలా దైవ స్వరూపుడిగా ప్రవేశించిన ఏకైక ఆర్య చక్రవర్తి అలెగ్జాండర్.
- పర్షియన్లు, అలెగ్జాండర్ ని దేవుడిగా కొలిచినప్పుడు భారతీయులు ఎందుకు కొలవరు..? ఇదంతా ఒక కుట్రతో కూడిన నిశ్శబ్దం (Conspiracy of Silence). మాథ్యూ ఆర్నాల్డ్, పి.ఎ.స్మిత్ లాంటి పరిశోధకులు ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు కూడా!
- `ఇస్కందర్' పర్షియన్ పేరుని `స్కంధ' అని భారతీయులు సంస్కృతీకరించారు. స్కూలుని - ఇస్కూలు అన్నట్లే స్కంధ, ఇస్కంద పదాలు రెండూ ఒకటే.
- సంస్కృత సాహిత్యంలో స్కంధ అంటే కుమారస్వామి. షణ్ముగం, ఆర్ముగం, మురుగన్ లాంటి తమిళ పేర్లతో పిలువబడిన సుబ్రహ్మణ్యస్వామి, ఈ కుమారస్వామి ఒక్కరే! `కార్తికేయుడు' కూడా ఈయనే! `స్కంధ' అని పిలువబడిన అలెగ్జాండర్ మా `మురుగన్' అవతారమే!
- అలెగ్జాండర్ ఒక రాకుమారుడు. `కుమార' అంటే సంస్కృతభాషలో `స్కంధ' అని! ఆయన యుద్ధదేవుడు. సేనాని కూడా. `సేనాని' అంటే కుమారస్వామే!
- `స్కంధ అంటే శక్తిధరుడు' త్రిశూలధారి. అలెగ్జాండర్ ఆయుధం బల్లెం.
- పర్షియన్ ప్రభువు దరియస్ (DARIUS) ని అలెగ్జాండర్ సంహరించాడు. స్కంధ అనే కుమారస్వామి తారకాసురుడిని జయించాడు. `దరియస్' పదం `తారక' పదానికి గ్రీకు రూపమే! దార, తార పదాలు సంరక్షణనే సూచిస్తాయి.
- దరియస్ తర్వాత పర్షియాలో `అహుర మజ్ద' మత ప్రాబల్యం అంతరించిపోయింది. అణిమెనిడ్ రాజవంశ పాలన ముగిసింది. గ్రీకుల చిరకాలవాంఛ నెరవేరింది.
- `స్కంధ'ని మహిషాసుర మర్దనం చేసినవాడుగా చెప్తారు. అహరమజ్ద అంటే అసురుల సంరక్షకుడు అని! `అహుర మజ్దా'ని కనుమరుగు చేయటం అంటే, అసుర సంహారం పూర్తిచేయడం అని! స్కంధ అసుర సంహారం చేసినవాడు కాబట్టి, అలెగ్జాండర్ అంటే కుమారస్వామే!
- అలెగ్జాండర్ బాక్ట్రియా రాకుమారి రోగ్జనాని పెళ్ళి చేసుకున్నాడు. స్కాంధ పురాణం ప్రకారం, కుమారస్వామి దేవసేనని పెళ్ళాడాడు. రోగ్జానా అంటే రజ్ = వెలుగు అని. దేవసేనలో దివ = వెలుగు.
- అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు చంద్రగుప్తుడు చాలా చిన్న కుర్రవాడు. అలెగ్జాండర్ మీద ఆరాధనా భావం పెంచుకొని, ఆయన బొమ్మకు పూజలు చేశాడు.
- కుమారస్వామి వాహనం నెమలి. అందుకే మౌర్య చక్రవర్తులు మయూరం పేరునే తమ వంశనామంగా చేసుకున్నారు. నెమలి తమిళుల సొంత పక్షి!
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|