|
|
Articles: Devotion | గురుపూర్ణిమ-సందేశం - Site Administrator
| |
ఈ పండుగ యొక్క ప్రేరణను స్వీకరించి జీవాత్మ పరమాత్మ దాకా చేరుకొనే ప్రయత్నాన్ని చెయ్యగలుగుతాడు. వేద వ్యాసులవారు విశ్వంలోని మొట్టమొదటి ఆర్ష గ్రంథమగు `బ్రహ్మసూత్రాలు' రాయడం వ్యాసపౌర్ణమి రోజుననే పూర్తయ్యింది. `ఈ రోజున ఏ సాధకుడైతే ఆచార్యుని ఉపాసన చేస్తాడో, ఆచార్యుని సంతుష్ఠునిగావించి తన ఆథ్యాత్మిక మార్గాన్ని నిర్ణయించుకొంటాడో అతడికి సంవత్సరంలోని పండుగలన్నింటినీ జరుపుకొనిన ఫలితం లభిస్తుంది' అని దేవతలందరూ ఈ రోజును ఆశీర్వదించారు. అప్పటి నుండి మానవుడు ఈ వ్యాసపూర్ణిమను ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో జరుపుకొంటూ వస్తున్నారు. భారత వాసులు సరే, కానీ పైనున్న లోకాలకు చెందిన యక్షులు, కిన్నెరులు, గంధర్వులు మరియు యోగి పురుషులు మొదలగు వారంతా కూడా ఈ ఉత్సవాన్ని మహా ఉత్సాహంతో జరుపుకొంటారు.
ఇది పెద్ద పెద్ద కథలను వినే ఉత్సవం కాదు. ఇది గురువు ఎదురుగుండా కూర్చునే ఉత్సవం. ఇది కథా ఉత్సవం కాదు. మొత్తం కథలన్నీ దేనినుండి పుట్టుకొచ్చి దేనిలో లీనమైపోతాయో అటువంటి ప్రకృతిభిన్నమైన ఆనందస్వరూపమగు ఆత్మలోకి చేరుకోగలిగే ఉత్సవం. ఉత్సవం... `ఉత్' అనగా సమీపం. `సవం' అనగా యజ్ఞం. గురుకృప వలన దగ్గరలో దగ్గరగా ఉన్న ఆనంద స్వరూపమగు ఆత్మలోనికి చేరుకోగలిగే యజ్ఞమేదైతే ఉందో దానిపేరే వ్యాసపూర్ణిమా ఉత్సవం.
తక్కిన ఉత్సవాలను మనం జరుపుకొంటాం. కానీ ఈ వ్యాస పూర్ణిమ మాత్రం మనకోసం తానే పండుగను జరుపుకొంటుంది. తల్లి తన పిల్లవాడిని `ఇలా రా నాయనా! ఇప్పటిదాకా చాలా ఆడుకొన్నావు. మట్టిలో మురికి అంటుకొంది. ఇక స్నానం చేసి స్వచ్ఛంగా మారిపో. వెన్న, మిశ్రీ తిను' అని ఎలా బుజ్జగిస్తుందో అలాగే వ్యాసపూర్ణిమ కూడా `జన్మజన్మలుగా అక్కడా ఇక్కడా తిరుగుతున్న జీవుడా! ఇక నువ్వు నీ రామస్వరూపంలోనికి రా. నీ జ్ఞాన స్వరూపం లోకి రా. నీ జీవనదాతవైపుగా రా' అని అంటుంది. ఎలాగైతే తల్లి వాత్సల్యంతో తన పిల్లవాడిని బుజ్జగిస్తూ, స్వచ్ఛంగా మార్చి వాడికి పుష్టిని కలిగిస్తుందో అలాగే వ్యాసపూర్ణిమ మనల్ని బుజ్జగిస్తూ మన అంత: కరణాలను స్వచ్ఛంగా మార్చి అహంకార రహితం, దంబ రహితం అనే సద్గుణాలను నింపి ఆచార్య ఉపాసనా వంటి మార్గదర్శనాలను కలిగించి, ఆచార్యుల అనుభవాన్ని జీర్ణం చేసుకోగలిగే యోగ్యతను మనలో కలిగించగలిగే కృపను చూపిస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|