TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
ఉంగరం
- Miss rajeswari rajeswarinedunuri
< < Previous   Page: 2 of 4   Next > >  
ఒక ఉన్నతోద్యోగిగా రెటైర్ అయిన శర్మ గారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు పెళ్ళై ఆరేళ్ళు గడిచినా ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదా వేసుకున్నారేమో ఈ మధ్య రెండేళ్ళ క్రిందట చిన్నవాడికి పెళ్ళి కావడంతో తమకింకా పిల్లలు లేకపోతె ఎదురయ్యే సమస్యలని గుర్తు చేసుకున్నట్టు తోడి కోడళ్ళిద్దరు అన్నిటితో పాటు వంతుగా పిల్లల్ని కూడా రెండు మూడు నెలలు అటూ ఇటూగా కన్నారు. అందుకే పెద్దవాడి కొడుక్కి పది నెలలు చిన్న వాడి కూతురికి ఎనిమిది నెలలు. అంచేత ఇద్దరికి చంటి పిల్లలే. ఇక అమ్మాయి నాలుగేళ్ళ క్రిందటే పెళ్ళి గావటంతో అత్త గారింట్లోనే ఉంది రెండేళ్ళ పసివాడు. బాధ్యతలు తీరి విశ్రాంతిగా ఉన్నారు ఆదిలక్ష్మి దంపతులు. ఐతె ఇంతకీ అసలు సంగతి ఆ రోజు అదే పదిహేను ఇరవై రోజుల క్రిందట. ఏం జరిగిందంటే ఆ రోజు శుక్రవారం కావటంతో ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఆదిలక్ష్మి బయటికి వచ్చేసరికి తోడికోడళ్ళిద్దరూ వెతుకుతూ కనబడ్డారు. 'ఏమిటి? అంతగా వెతుకుతున్నారు?' అడిగింది అత్తగారు తలార బెట్టుకుంటూ. 'ఉంగరం అత్తయ్య గారు! పిల్లకి సిరిలాక్ తినిపిస్తూ తీసి పక్కన పెట్టాను. తీరా చేతులు కడుక్కుని వచ్చి చూద్దునుకదా కనబడటం లేదు అంది. అదేమిటి? ఇంతలో ఏమై పోతుంది? ఇంకా పనిమనిషి కుడా రాలేదుకదా! ఉన్నది మీ ఇద్దరే అంది ఆదిలక్ష్మి. అవును అదే అనుకుంటున్నాం. ఒకవేళ తుక్కులో ఏమైనా పడిందేమో అని నసిగారిద్దరు . 'తుడవందే తుక్కెక్కడిదీ?' మొన్నటికి మొన్న నల్లపూసల దండతీసి దిండు మీద పడేసావ్.. పిల్ల చేతిలోకి తీసుకుని ఆడుతోంది. గట్టిగా లాగితే? ఐనా పనిమనిషి వస్తుందేమో అన్న భయంతో తీసి నీ మంచానికున్న సొరుగులోనె పెట్టాను. వెంటనే చూసి తీసుకున్నావు గనుక సరిపోయింది. లేక పోతె పని వాళ్ళు తిరుగుతారు ఎవర్ననగలం? ఐన అంత అజాగ్రత్త ఐతె ఎలాగ? బంగారం అక్కడ ఇక్కడా పెట్టడం మంచి పద్ధతి కాదు. లక్ష్మిని లక్ష్య పెడితేనే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు! అంటూ కాస్త గట్టిగానే మందలించింది అత్త గారు ఆదిలక్ష్మి.

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 4   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.