|
|
Articles: Devotion | సాయి నక్షత్ర మాలిక - Site Administrator
| |
ఊదీ వైద్యము చేసితివీ - వ్యాదులనెన్నో బాపితివీ
సంకీర్తన చేయించితివీ - చిత్త శాంతి చేకూర్చితివీ
అల్లా నామము పలికితివీ - ఎల్లరి క్షేమము కోరితివీ
చందనోత్సవము చేసితివీ - మత ద్వేషాలను మాపితివీ
కుష్టురోగినీ గాంచితివీ - ఆశ్రయమిచ్చి సాకితివీ
మానవధర్మం నెరపితివీ - మహాత్మునిగ విలసిల్లితివీ
ధునిలో చేతిని పెట్టితివీ - కమ్మరి బిడ్డను కాచితివీ
శ్యామా మొర నాలించితివీ - పాము విషము తొలగించితివీ
జానెడు బల్లను ఎక్కితివీ - సర్వజ్ఞుడ వనిపించితివీ
బల్లి రాకను తెలిపితివీ - సరవజ్ఞుడవనిపించితివీ
లెండీ వనమును పెంచితివీ - ఆహ్లాదమునూ పంచితివీ
కర్తవ్యము నెరగించితివీ - సోమరితనమును తరిమితివీ
కుక్కను కొడితే నొచ్చితివీ - నీపై దెబ్బలు చూపితివీ
ప్రేమ తత్వమును చాటితివీ - దయామయుడ వనిపించితివీ
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|