|
|
Articles: TP Features | విశ్వ వేదిక 'మ్యూజిగుల్' - Site Administrator
| |
పదకవితా పితామహుడు అన్నమయ్య కీర్తనలను లక్ష గొంతులతో వినిపించిన వేదిక సిలికానాంధ్ర. భాగ్యనగరిలో లక్షగళ స్వరార్చన అనే అనితరసాధ్యమైన మహత్కార్యాన్ని అలవోకగా, అఖిలాంధ్రలోకం ఔరా! అని అబ్బురపడి ఆలకించిన అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించిన సిలికానాంధ్ర.... దాని సూత్రధారుడు ఆనంద్... అమెరికాలో కూచిపూడి నృత్యోత్సవాలను నిర్వహించినా... మరేదైనా కార్యక్రమాన్ని చేపట్టినా దానిలో తెలుగువాడి ఔన్నత్యం ప్రతిబింబిస్తుంది.
లక్ష మందితో అన్నమయ్య కవితల స్వరార్చన అంటే అందరూ నవ్వేరు. పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటేనే స్టేడియానికి పాతిక వేల మంది రారు. హైదరాబాద్ కు లక్ష మంది గాయకులు రావడమా అంటూ హాశ్చర్యపోయారు... ఆనంద్ అజ్ఞానాన్ని చూసి. స్వయం ప్రకటిత సాహితీ, సంగీత ఉద్దారకులు... ఆంధ్రదేశంలో సంస్కృతిని కాపాడటానికి వంశపారంపర్య ధర్మకర్తృత్వాన్ని గుత్తకు తీసుకున్న మహారాజ పోషకులూ... కనీసం కలలో కూడా ఊహించని అద్భుతం జరిగింది కదా? నాకు తెలుసు తెలుగుగడ్డ మీద సంగీతం అంటే ప్రాణాలు పెట్టే ప్రతిభావంతులైన కళాకారులు లక్షల మంది ఉన్నారు.. సొంత ఖర్చులతో ఆ రోజు హైదరాబాద్ వచ్చారు. గొంతెత్తి పాడారు. ప్రపంచం అన్నమయ్య సంకీర్తలను వేనవేల వీనులతో విన్నది కదా? అది నిజంగానే పరమాద్భుతమైన కార్యక్రమం అంటూ ఆనంద్ తన్మయత్వంతో పరవశించిపోతారు. సిలికానాంధ్ర ఎందుకు చేస్తుందంటే యావత్ ప్రపంచం తెలుగువాడి గొప్పతనం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే అంటారు ఆనంద్. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కష్టమే అయినా అనంతరం కలిగే అనంతమైన తృప్తికి సాటి లేదని ఆయన చెబుతారు.
తెలుగువారి శక్తి సామర్ధ్యాలు ఉన్నతమైనవని ఆనంద్ అంటారు. కాకపోతే భారతీయత లేని నాయకత్వం- నాయకత్వం లేని భారతమే అసలు సమస్య అని ఆయన అభిప్రాయం. ఏదైనా కార్యక్రమాన్ని మనం చేపడితే ఏదో ప్రయోజనం ఆశించే చేస్తున్నామని ఆలోచించే వారితోనే అసలు సమస్య అని లేకపోతే ఆంధ్రుల ప్రతిభకు ఈ ప్రపంచం ఎప్పుడో పట్టం కట్టి ఉండేదని ఆనంద్ విశ్వాసం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|