TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
రాజ్యాంగానికి షష్టిపూర్తి
- Site Administrator
< < Previous   Page: 2 of 5   Next > >  
అలాగే డాక్టర్ అంబేద్కర్ ఏమన్నారంటే : 'రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని నడిపించేవాళ్ళు చెడ్డవాళ్ళయితే అది చెడ్డదవుతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదయినా అది నడిపించే వాళ్ళు మంచివాళ్ళయితే అది మంచిదవుతుంది'. రాజ్యాంగం పనిచేయడం అనేది రాజ్యాంగం మీద ఆధారపడి ఉండదు. శాసనసభ, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థల వంటి రాజ్యాంగ అంగాల్ని మాత్రమే రాజ్యాంగం తయారు చేస్తుంది. అవి పనిచేయడం అనేది ప్రజల మీద, ప్రజలు తమ కోరికలు తీర్చుకోవడానికి తయారుచేసుకొనే రాజకీయ పార్టీల మీద, అవిచేసే రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు, వారి రాజకీయ పార్టీలు ఎలా ప్రవర్తించేది ఎవరు చెప్పగలరు?... మన స్వాతంత్ర్యాన్ని చివరి రక్తపుబొట్టు వరకు రక్షించుకోవాలి. 395 అధికరణాలతో, 22, భాగాలుగా, 12 అనుబంధాలతో మన రాజ్యాంగం, ప్రపంచ రాజ్యాంగాల్లో కల్లా అతి పెద్ద రాజ్యాంగంగా తయారైంది. గడచిన 60 సంవత్సరాల్లో దాదాపు 110 సార్లు సవరణకు గురైంది. అది తయారుచేసినపుడు జనాభా 250 మిలియన్లు. ఈ రోజున నాలుగురెట్లు దాటింది. మన పార్లమెంటుకు 15 సార్లు ఎన్నికలయ్యాయి. ఈ 60 ఏళ్ళలో జమిందారీలు రద్దయ్యాయి. భూ సంస్కరణలు అమలయ్యాయి. పోర్చుగల్, ఫ్రెంచి కాలనీలు మన వశమయ్యాయి. సైన్సు, సాంకేతిక, వైద్య, సమాచార, ఇంజనీరింగ్ రంగాలలో విశేష అభివృద్ధి జరిగింది. వ్యవసాయ ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. శిశుమరణాలు సగమయ్యాయి. మన వ్యోమగామి చంద్రుడిపై కాలు పెట్టాడు. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు అధికారాన్ని చవిచూశాయి. మన ప్రజాస్వామ్యంలో ఢోకా లేకుండా దేశ సమగ్రతని కాపాడుకోగలిగాం. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత వ్యక్తి స్వాతంత్ర్యం, వాక్స్వాతంత్ర్యం నిలబెట్టుకోగలిగాం. దాదాపు 7 కోట్ల మంది ఓటర్లు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు 32 లక్షల రాజకీయ నాయకుల్ని ఎన్నుకొంటారు. ప్రతి గ్రామానికీ ఒక కిలో మీటరు దూరం లోపల ప్రాథమిక విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంలో 95 శాతం ప్రగతి సాధించాం. కాని దేశంలో 5 ఏళ్ళ లోపు పిల్లల్లో సగం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. 2000 సంవత్సరానికే అందరికీ ఆరోగ్యం అందిస్తామన్నా, ఆ అంతర్జాతీయ అంగీకారంలో సగం కూడా కృతకృత్యులం కాలేకపోయాం. ఈ రోజుకీ దేశంలో నాల్గవవంతు జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. అవినీతిలో ముందున్నాం. మనదేశ సంపదలో 85 శాతం 20 శాతం మంది చేతిలోనే ఉంది. దిగువ 20 శాతం దగ్గర ఉన్న సంపద 1.5 శాతం మాత్రమే. కుల ప్రభావం పోలేదు. మత ద్వేషాలు, ప్రాంతీయ ద్వేషాలు అదను చూసుకొని చెలరేగుతున్నాయి.

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 5   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.