TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
భాషా ప్రాచీనత: కొత్త కోణాలు
- Site Administrator
< < Previous   Page: 2 of 9   Next > >  
బెర్నార్డ్ సార్జెంట్, క్లయిడ్ అహ్మద్ వింటర్స్ మైఖేల్ విజ్జేవ్ లాంటి ఆధునిక పరిశోధకులు మొత్తం ద్రావిడ భాషలలో తమిళం ఒక్కటి. అంతేగాని అదే 'మూలద్రావిడ భాష - ప్రోటో ద్రవిడియన్' కాదని గట్టిగా చెప్పిన వారిలో ప్రముఖులు. సార్జెంట్ తమిళభాషా దురహంకారాన్ని ఖండించాడు కూడా. అయితే మొత్తం ద్రావిడ భాషలలో రెండు వేల ఏళ్ళ కనీస కాలంలో వెలువడిన సాహిత్యాన్ని పదిలపరచుకొని ప్రాచీన భాషా సంపదను క్రోడీకరించుకొని 'తమిళ వెర్సికాన్' నిర్మించుకొని ద్రవిడ భాషలపైన పరిశోధనలు చేయటానికి కావలసిన ద్రవిడ సామాగ్రిని అందించడంలో తమిళులు గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారు. మన తెలుగు పరిశోధకులలో చాలామందికి ఆ దృష్టి లేదు. నన్నయకు ముందు మనకు ఏమీ లేదని నమ్మేవారే మనలో ఎక్కువ. ఉన్నదానిని ఆధారం చేసుకుని తెలుగు వెర్సికాన్ అనే బృహన్నిఘంటువును నిర్మించుకునే ప్రయత్నం మనం చెయ్యకపోగా బ్రౌన్ నిఘంటువును దాటి ఇవతలకు రాలేకపోయాం. మౌలికంగా తెలుగుభాషకు జరిగిన అన్యాయం ఇదే. ఇది మనకు మనం చేసుకున్నదే! ద్రావిడ భాషా పరిశోధనలకు ఎం.బి.ఎమెనో, టి.బుర్రో మహనీయులు నిర్మించిన ద్రవిడియన్ ఎటమలాజికల్ డిక్షనరీ DEDR ఒక్కటే ఇప్పటికీ ఆధారంగా ఉన్న నిఘంటువు. కానీ ఇందులో చాలా తెలుగు పదాలు కన్పించవు. బెల్లం, పంచదార లాంటి తెలుగు మాటల ఉనికి ఈ DEDR లో లేదు. కనీసం మరికొన్ని తెలుగు మాటలను చేర్చి ఈ DEDR పునర్నిర్మించే ప్రయత్నాలు కూడా ఏ విశ్వవిద్యాలయమూ చెయ్యలేదు. తెలుగువారు కాని, తెలుగు తెలియని పరిశోధకులకు తెలుగు పద సంపదను పరిచయం చేసేలా DEDR ని ఆధునీకరించవలసిన అవసరాన్ని గట్టిగా గుర్తించినట్టు కన్పించదు. సింధు సరస్వతీ నాకరికతలో ద్రావిడులు : సింధు నగర నిర్మాతలలో ద్రావిడులున్నారనే విషయంలో దాదాపు ఏకాభిప్రాయమే కన్పిస్తోంది. ఈ విషయమై పరిశోధన చేస్తోన్న చరిత్రవేత్తలలో సింధు నగరాలకు, ఋగ్వేద రూపకల్పనకూ మధ్య కాలవ్యవధిని నిర్ణయించటంలో ఎవరి అభిప్రాయాలు వారివిగా ఉన్నప్పటికీ, సింధు నగరాలకు సమాంతర కాలంలోనే ఋగ్వేదం రూపొంది ఉండాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. సరస్వతీ తీరంలో ఋగ్వేద ఆర్యులు ప్రాబల్యం, సింధుతీరంలో ద్రవిడుల ప్రాబల్యం ఎక్కువగా ఉండివుండవచ్చునే ఒక సమన్వయాన్ని చేయటానికి విజ్జెల్ లాంటి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఎమెనో, బుర్రోలు 1962లోనూ, క్వీపర్ 1967 లోనూ, సౌత్ వర్డ్ 1977 లోనూ, వింటర్ 1989లోనూ, మైకేల్ విజ్జల్ 1999లోనూ బెర్నార్డ్ సార్జెంట్ 2008లోనూ ఋగ్వేదంలో అనేక వందల ద్రావిడ పదాలను ఎత్తి చూపించారు. ముండా భాషా పదాలు, ద్రవిడ భాషా పదాలను కనీసం 700 వరకు ఇప్పుడు నిరూపించగలుగుతున్నారు.

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 9   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.