TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
సంకల్ప విజయం
- Site Administrator
< < Previous   Page: 2 of 3   Next > >  
పుస్తకాలు చదవటమంటే అంత ఆసక్తి లేదు అనేవారు తమకిష్టమైన ఏదో ఒక పనిమీద మనసుబెట్టి చేసుకొంటుంటే నిరాశ నిస్పృహలు ఉండనే ఉండవు. ఈ మధ్యకాలంలో చీరల మీద వర్క్ చేయటం లాంటి పనులు వచ్చేయి. తమ పని తాము చేసుకొన్నామనే తృప్తి కాక... మరి కొందరికి నేర్పటం తయారుచేయటంతో ఆదాయమార్గాలు కూడా ఏర్పడుతున్నాయి కదా! వెనుకటి రోజుల్లో ఎక్కువమంది స్త్రీలు కలిసినప్పుడు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొనే వారనే అపప్రధ ఉండేది. అపుడు బయటకు వెళ్ళడం, నీళ్ళమోతలు వగయిరా ఉండేవి... ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎవరింట్లో వాళ్ళు టీవీకి అతుక్కుపోయి కూర్చుంటున్నారు. ఒకరితో ఒకరు మంచి చెడులు మాట్లాడుకోవడం తక్కువయింది. కనీసం ఇంట్లో ఇంట్లో వాళ్ళే కలిసి భోంచేయటం, ఒకరికొకరు చూసుకుంటూ కబుర్లాడుకొంటూ తినటం కాకుండా టీవీ వైపు చూస్తూ తింటం అలవాటయింది. పోనీ ఆ టీవీల్లో వచ్చే కార్యక్రమాల్లో తెలుసుకోదగ్గవాటిని చూస్తున్నామా అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి! సీరియల్స్ చూసినంత శ్రద్ధగా న్యూస్ చూస్తున్నామా! అని ప్రశ్నించుకోవాలి. పని ఒత్తిడి అనేది ఎవరికయినా ఉంటుంది. స్త్రీ, పురుషుల్లో ఎవరికెక్కువ, ఎవరికి తక్కువ అని కాదు. ఈ రోజు స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. అటు ఇటు కూడా సమర్ధించుకొని చక్కగా చేస్తున్నారు. పురుషులు బయట విధులతో బాటు ఇంట్లోను సహాయపడేవారున్నారు. నేనే ఎక్కువ కష్టపడిపోతున్నానని, నా పనే కష్టతరమైందని అనుకొనే వారికి మాత్రం ఏ కోశాన ఓదార్పు ఉండదు. తమ మీద తామే జాలి పడటం మానేస్తే చాలా హాయిగా ఉంటుంది.

Read 4 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 2 of 3   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.