|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
20వ అధ్యాయము
పురంజయుని దురాగతం
జనక మహారాజు చాతుర్మాస్యవ్రత ప్రభావం విన్న తర్వాత వశిష్ఠునితో మునిపుంగవా కార్తీక మహత్యమును గురించి ఇంకా వినాలే కోరిక కలుకుతున్నది. కార్తీక మాస ప్రభావాన్ని ఎంత విన్నా తనివి తీరకున్నది. మరికొన్ని ఉదారహణలు చెప్పమని కోరెను. ఆ మాటలకు వశిష్ఠులవారు చిరునవ్వుతో ఓ రాజా! కార్తీకమాస మహత్యమును గురించి అగస్త్యమునికి, అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి ఉన్నది. దానిని వివరిస్తాను జాగ్రత్తగా వినమనెను.
పూర్వకాలంలో అగస్త్యమహర్షి అత్రి మహర్షితో ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశంతో పుట్టినవాడవు, కావున కార్తీకమాస మహత్యము గురించి నీకు తెలిసిన విషయాలను వివరింపమని కోరెను. అంత అత్రిమహాముని కుంభసంభవా! నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ఇష్టమైన వాటిలో ఎంతో ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సమానమైన శాస్త్రము, ఆరోగ్య సంపదకు మించిన సంపద లేదు. అలానే శ్రీమన్నారాయణుని కంటే వేరు దైవం లేదు. ఏ మనిషైనా కార్తీక మాసములో నదిలో స్నానము చేసి, శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినా, లేక దీపదానము చేసినా కలుగు ఫలితము అపారము. దీనికొక కథ చెబుతాను వినుము.
త్రేతాయుగంలో పురంజయుడు అనే సూర్యవంశపు రాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. అతడు అన్ని శాస్త్రములు తెలిసిన పండితుడు కావడంతో ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించేవాడు. అయినా ఇతనిలో కూడా ఓ దుర్గుణం ఉంది. అదే అపరిమితమైన అధికారంకాంక్ష, ధనాశ. కొన్నాళ్ళకు రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరించాడు. కోశాగారాన్ని అంతులేని సంపదతో నింపేశాడు. దీంతో పురంజయునికి అధిక సంపద చేత, రాజ్యాధికార గర్వముతో ఇదంతా తన ప్రమేయమేనని లోలోన ఎంతో మురిసిపోయేవాడు.
రానురాను అతనిలో అహంకార గర్వం పెరిగి ఇక తనంతటివాడు ఇంకొకరు లేరని విర్రవీగుతూ ఉండేవాడు. ఇంత సంపాదించినా ధనదాహం తీరక బ్రాహ్మణులు, దొంగలు, బందిపోట్లు కొల్లగొట్టుకొచ్చిన ధనంలో కూడా నిర్లజ్జగా సగం వాటా తీసుకుని తన ధనాగారాన్ని నింపుకునేవాడు. రాజుగారి దుశ్చర్యలు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజులకు తెలిసినది. దాంతో వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజ రాజును నాయకునిగా చేసుకొని నలువైపులా శిభిరములు నిర్మించి నగరమును ముట్టడిచేసి యుద్ధమునకు సిద్ధపడిరి.
అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని గుఢాచారుల వల్ల తెలుసుకున్న పురంజయుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండెను. అయిననూ ఎదుటివారు అధిక బలవంతులుగా ఉన్నననూ, తాను బలహీనుడుగా ఉన్నా లెక్క చేయక శత్రువులకు తామేమీ తీసిపోమమంటూ సైన్యానికి ధైర్యాన్ని చెప్తూ యుద్ధానికి సిద్ధపడి యుద్ధ భేరిని మోగించి సింహనాధం చేస్తూ శత్రుసైన్యాలపై బడెను.
వింశాధ్యాయము ఇరువది రోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|