|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
21 అధ్యాయం
పురంజయుడు కార్తీక ప్రభావమును తెలుసుకొనుట
పురంజయుడు ఈ విధంగా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరుగుతుంది.ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు, అశ్వసైనికులతోనూ మల్లులు, మల్లయుద్ధ నిపుణులతోనూ ఇలా ఇరుపక్షాల సైన్యాలు ఏమాత్రం తగ్గకుండా హోరోహోరీగా పోరాడుతున్నాయి. ఎవరికివారే విజయాన్ని వరించాలన్న పట్టుదలతో పోరాడుతున్నారు. ఇలా సాగుతున్న రణరంగంలో ఎక్కడ చూసినా తలలు తెగిన మానవమొండెములతో పాటు ఏనుగులు, గుర్రాల శవాలు, విరిగిన రథాలు, గుట్టలు, గుట్టలుగా పడి ఉంటాయి. యుద్ధంలో క్షతగాత్రులైన వారి మూలుగులు, హాహాకారాలు, రోదనలు ఎంతటి వారినైనా కలచివేసేలా వినిపిస్తున్నాయి.
పురంజయుని సైన్యం ఎంత పోరాడినా విధివశాత్తూ అతనికి పరాజయమే కలిగింది. దాంతో పురంజయుడు శత్రువుల చేతుల్లో ప్రాణాలు పోగుట్టోవాల్సి వస్తుందేమోనని భయపడి రణరంగం నుంచి పారిపోయి ఇంటికి వస్తాడు.దాంతో శత్రురాజులు తామే విజేతలమని ప్రకటించుకుని పురంజయుని రాజ్యాన్ని వారే పాలిస్తుంటారు. దీంతో చేసేది లేక జరిగినదానికి చింతిస్తాడు పురంజయుడు. అలాంటి సమయంలో రాజగురువైన వశిష్ఠుడు ఇతడిని ఊరడిస్తూ రాజా! ఇదంతా నీ స్వయంకృతాపరాధమే. రాజులకు రాజ్యవిస్తరణ చేయాలనే కోరిక ఉండాల్సిందే కానీ, నీకు మోతాదుకు మంచి ఉంది. ఎంత విస్తరించినా ఇంకా ఇంకా రాజ్యాలను జయించాలన్న కోరికతో, ఆశతో ఎంతో మంది మరణానికి కారకుడివి అయ్యావు. అంతేగాక నీ ధనాగారాన్ని పెంచుకోవాలన్న పేరాశతో పేద బ్రాహ్మణులను, ఆఖరికి దొంగల వద్ద కూడా సగం వాటా తీసుకుని వారికంటే నీవే పెద్ద గజదొంగలా ప్రవర్తించావు. ఈ విషయం పై నిన్ను ఎన్నో సార్లు నా శక్తివంచన లేకుండా హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా అధికారం, పదవీ వ్యామోహంతో నా మాటలు వినలేదు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇది శత్రురాజుల విజయం కాదు, నీ అత్యాశే నిన్ను ఓడించిందని చెబుతాడు.
పశ్చాత్తాపహృదయంతో బాధపడుతున్న పురంజయుడు 'గురువర్యా! నా తప్పులను మన్నించి ఇప్పుడు నేను ఈ కష్టకాలము నుండి బయటపడే మార్గాన్ని' చెప్పమని వేడుకుంటాడు. పురంజయా జరిగిందేదో జరిగింది. గతాన్ని తలచుకుని బాధపడుతూ కూర్చునే కంటే దానిద్వారా గుణపాఠం నేర్చుకుని ముందుకు నడిచేవాడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి నీవు విచారించకు. ప్రస్తుతం ఎంతో పవిత్రమైన కార్తీకమాసం నడుస్తోంది. ఇది ఈశ్వరునికి ఎంతో ఇష్టమైనది. అంతే కాదు శ్రీహరికి కూడా ఇష్టమైన మాసమే. అందులోనూ నీ అదృష్టం కొద్దీ రేపు కార్తీక పౌర్ణమి. ఇప్పటివరకు ఎలా గడిచినా రేపు శివారాధనతో గడిపితే జన్మజన్మల పాపాలు కూడా నశిస్తాయి. కాబట్టి నీవు రేపు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానసంధ్యాదులను ముగించుకుని శివుని ఆలాయనికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించు. వీలైనంత వరకూ ఈ రోజంతా భగవన్నామస్మరణతోనూ, పురాణ కాలక్షపంతోనూ కాలం గడుపు. రాత్రంత్రా భజనలతోనూ, నామస్మరణతోనూ జాగరణ చెయ్యి.
ఇలా చేసినందువల్ల నీకు మంచే జరుగుతుంది.మంచి పుత్రసంతానం కలుగుతుంది. ఇక ఈ కార్తీక మాసములో శివునితో పాటు హరిని కూడా పూజిస్తే మరింత పుణ్యం లభిస్తుంది. అంతేకాక నీ శత్రువులను ఓడించడానికి నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక పౌర్ణమి రోజు నీవు అలా చేసినచో నీవు పోగొట్టుకున్న రాజ్యమనును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడై, చెడు స్నేహాలు చేయడం వల్లే నీకు అపజయం కలిగినది? కాబట్టి నీవు ఇకనైనా శ్రీహరిని మదిలో తలచి నేను చేప్పిన విధంగా చేయమని హితోపదేశము చేసెను.
ఏకవింశాధ్యాయము ఇరువది ఒకటవ రోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|