|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
22వ అధ్యాయం
పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట
పుంరజయుడు వశిష్ఠుడు చెప్పిన విధంగానే కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదీస్నానం చేసి, సంధ్యావందనములు ముగించుకుని గుడుకివెళ్ళి పరమేశ్వరునితో పాటు శ్రీహరిని కూడా నిష్టగా పూజిస్తాడు. తదుపరి ఇంటికి వచ్చి హరిహరాదుల నామాలను జపిస్తూ రాత్రంతా జాగరణ చేస్తాడు. అప్పుడు విష్ణుభక్తుడైన ఒక వృద్ధబ్రాహ్మణుడు పురంజయుని ఇంటికి వచ్చి 'రాజా! కవలరపడకు, నీవు పోగొట్టుకున్న రాజ్యం తప్పకుండా త్వరలో నీ వశమవుతుంది' అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. దాంతో పురంజయునిలో పోయిన ధైర్యం తిరిగి వచ్చినట్లవుతుంది. అలాగే నీరసపడ్డ సైన్యానికి ధైర్యవరచనాలు చెప్పి అంతకుముందులా వారు ధైర్యసాహసాలను ప్రదర్శించే కృషి చేస్తాడు. దాంతో అందరూ రెట్టించిన ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు శత్రురాజులపై దండెత్తుదామా అని ఉరకలు వేస్తూ ఉంటారు.సమయం చూసి ఒకనాడు యుద్ధానికి ఆహ్వానిస్తాడు పురంజయుడు.
ఒకసారి దెబ్బతిని కూడా మనల్ని యుద్ధానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని ఆలోచిస్తారు శత్రురాజులు. అయినా యుద్ధానికి పిలిచినప్పుడు రాననడం ఓడిపోవడం కిందే లెక్క కాబట్టి వాళ్ళుకూడా తమ సైన్యంతో యుద్ధంరంగంలోకి వెళతారు. ఇరుసైన్యాలు హోరాహోరీగా పోరాడుతాయి. అసలే ఒకసారి దెబ్బతిన్న పురంజయుడు ఈసారి విజయాన్ని సాధించాలన్న పౌరుషంతో శత్రురాజులపై పోరాడతాడు. పురంజయుని సైన్యం కూడా అదే పౌరుషాన్ని చూపిస్తుంది. దాంతో వీరి ధాటికి శత్రుసైన్యం ఎదురునిలవలేక పోతుంది. అందులోనూ పురంజయునికి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అండే కొండంతగా ఉంది. దైవబలం ముందు మానవబలం ఎంతవరకు పనిచేస్తుంది. కాబట్టి కాంభోజిరాజు నేతృత్వంలోని శత్రురాజులు, వారి సైన్యం పురంజయుని సైన్యం ధాటికి ఆగలేక హాహాకారాలు చేస్తూ యుద్ధ భూమినుంచి పారిపోవడంతో పురంజయున్ని విజయలక్ష్మి వరిస్తుంది. అతని రాజ్యం అతనికి దక్కిందంటూ అగస్త్డ్యుడు చెప్పినవిధంగానే ధనలోభికి అంగీరసుడు తెలియచేస్తాడు.
సాక్షాత్తూ వైకుంఠవాసుడే మన పక్షాన నిలిచి మనల్ని నిరంతరం కాపాడుతుంటే ఇక మనకు కొరతేమీ ఉంటుంది? శ్రీమన్నారాయణుడు గజేంద్రునికి మోక్షం కలిగిస్తాడు. హిరణ్యకశ్యుపుడు తన పిల్లవాడైన ప్రహ్లాదుడిని ఎన్నో బాధలు పెడతాడు. అయినా అవి ఆబాలుడిని ఏం చెయ్యగలిగాయి? మరి ఇదెలా సాధ్యమైందంటావు. కేవలం ఆ నారాయణుని కృపవల్లే కదా. హరినామాన్ని తలచేవాడికి శత్రువు కూడా మిత్రుడవుతాడు. కార్తీకమాసంలో ప్రతిరోజూ నదీస్నానం చేసి ఆలయంలో దీపం వెలిగిస్తే పాపాలు పూర్తిగా తొలగిపోతాయి.
శ్రీహరి సర్వాంతర్యామి. వేయి సూర్యభగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. పదునాలుగు లోకాల్ని తన కడుపులో ఉంచుకుని కాపాడే ఆదినారాయణుడు. అటువంటి పరమాత్మను ఈ మాసంలో ప్రతిరోజూ భక్తితో పూజిస్తే వారి ఇంట శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవితో సహా కొలువుంటాడు. ఆ గృహం సిరిసంపందలతో కళకళలాడును. కార్తీక మాసంలో శుచియై పురాణాన్ని చదివినచో పితృదేవతలు సంతృప్తి చెందుతారు. వారి వంశము తరించును. ఇది ముమ్మాటికీ నిజము.
ద్వావింశాధ్యాయము ఇరువది రెండవరోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|