|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
27వ అధ్యాయం
దూర్వాసునికి శ్రీహరి హితబోధ
మరలా ఆ శ్రీహరి దూర్వాసున్ని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెప్పెను. ఓ దూర్వాసమునీ నీవు అంబరీషున్ని శపించిన విధంగా ఆ పది జన్మలూ నేను అవతారమెత్తుతాను. నాకు కష్టముకాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. లేకున్నచో బ్రాహ్మణుని మాట అసత్యమగును. అది మంచిది కాదు. ఇటు నా భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుటయే నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అతడు బాధతో బ్రాహ్మణుని అవమానించితేనని చింతిస్తూ ప్రాయోపవేశము చేయతలచాడు. ఆ కారణము వల్లే విష్ణు చక్రము బాధించుచుండెను. ప్రజారక్షణమే రాజధర్మము కాని, ప్రజాపీడనము కాదు.
ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షించాలి. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించాలి. ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణున్ని తప్ప వేరెవ్వరూ యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణులను దండించకంటే పాపం లేదు. విప్రున్ని హింసించువాడు బ్రాహ్మణహంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్ర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణున్ని గ్రామము నుండి తరిమినవాడును, బ్రాహ్మణులను త్యజించినవాడు బ్రహ్మహంతకులే అవుతారు. కాన ఓ దూర్వాస మహర్షీ అంబరీషుడు నీ గురించి బాధపడుతూ తపశ్శాలి, విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా వలన ప్రాణసంకటమును పొందుచున్నాడు అని బాధపడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి నీవు సత్వరమే అంబరీషుని వద్దకు వెళ్ళుము. అందువలన మీ ఇద్దరికీ శాంతి లభిస్తుందని మహావిష్ణువు దూర్వాసునకు నచ్చచెప్పి అంబరీషునివద్దకు పంపెను.
సప్తవింశాధ్యాయము ఇరువది ఏడవరోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|