|
|
|
|
Articles: Devotion | శిరిడి దర్శిని - 3 - Mrs. seetha suri
| |
గుర్రము సమాధి : లెండి బాగులో బాబాకి అత్యంత ప్రియతమమైన శ్యామకర్ణ గుర్రము సమాధి ఉన్నది. ఈ సమాధికీ మహా సంస్థానం వారు పూలదండలు వేసి పూజలు చేస్తున్నారు. ఇది దత్తమందిరం వెనకాల ఉన్నది.
ఇవిగాక ఇంకా ఎన్నోసమాధులున్నాయి. అందులోముఖ్యమైనవి ఆమీదాస్మెహ్త సమాధి : ఈయన బాబా లీలలను గుజరాత్ రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాలకూ వ్యాపింపజేసిన ఘనుడు.
అబ్దుల్ బాబా సమాధి : అబ్దుల్ బాబా బాబాతో అనునిత్యం గడిపి ఎంతో సేవ చేసి బాబాకు ప్రేమ పాత్రుడయ్యాడు. ఆయన నిత్యం ఖురాన్ బాబాకు చదివి వినిపించేవారు. అలాగే బాబా చెప్పిన సూక్తులు రామాయణ కథలు ఉర్దూలో రాసి నిక్షిప్తం చేసిన మహా వ్యక్తి.
నానావల్లి సమాధి : బాబా మహాసమాధి పొందిన 13వ రోజున నానావల్లి కూడా సమాధి పొందాడు.
బహు మహారాజా కుంభల : ఇతని సమాధి నానావల్లి సమాధి పక్కనే ఉన్నది. ఊరి ప్రజలు ఈయన సంస్మరణార్ధం ఈయన పుణ్యతిథి నాడు (27.4.1938) అన్నదానం నిర్వహిస్తారు.
తాత్యాకోటే పాటిల్: ఈయన బాయజామాయి కుమారుడు. బాబానిత్యం బాయజా మాత ద్వారా భిక్ష స్వీకరించేవారు. ఈమె కుమారుడు బాబాతో చిన్ననాటి నుండి ఆడుకునేవాడు. ఈయన బాబాకు అత్యంత సన్నిహితుడు. 1945 ఆగస్టు 6 న సమాధి పొందాడు. అది కూడా ఈ లెండీబాగ్ లోనే ఉన్నది.
రాహాతా : బాబా తరచూ శిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్ళేవారు. సామాన్యంగా శిరిడీ వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కారు. రాహాతాలో ఉన్న చంద్రభాను సేథ్ కు బాబా అంటే మిక్కిలి ప్రేమ. అదేవిధంగా బాబా కూడా చంద్రాభాను సేథ్ ను అతని తర్వాత ఆయన అన్న కుమారుడైన కుశాల్ చందును అభిమానించేవాడు. అందువలన రాహాతా వచ్చేవారు. రాహాతా ప్రజలు బాబాను చూసి తన్మయత్వం చెందేవారు. బాబాకు ఘన స్స్వాగతం పలికేవారు. ఇక్కడి నుంచి బాబా స్వయంగా పూలపాదులు తెచ్చి శిరిడీలో తోట పెంచేవారు. ఇక్కడ ఉన్న మారుతి మాందిరం దర్శించేవారు. బాబా తరచూ దర్శించిన రాహాతా మరో శిరిడియే అనడం సహజమే.
సాకూరి: రాహాతా సమీపంలో ఉపాసనీ బాబాచే బాబా ఏర్పాటు చేసిన కన్యక ఆలయం ఉంది. ఇక్కడ కన్యలే నిత్యం యజ్ఞ కార్యాలు చేస్తున్నారు. సమీపంలోనే ఏకముఖ దత్తదేవుని ఆలయం ఉంది.
శిరిడీలో బాబాతో పాటు కలిసి ఉన్న భక్తుల నివాసాలు : లక్ష్మీబాయి తుకారాం షిండే : ఈమె ఇల్లు ద్వారకామాయి ఎదురు సందులో అప్పుడు ఎలా ఉన్నదో అలాగే ఇప్పుడూ ఉన్నది. బాబా దగ్గరకు ఏ వేళ అయినా వెళ్ళగల హక్కు ఈమె ఒక్కరికే బాబా ఇచ్చారు. బాబా అంతిమ సమయంలో ఈమె చేతితో ఇచ్చిన పాలు తాగి బహుమతిగా ఈమెకు 9 నాణాలు ఇచ్చారు. ఈమె 2.6.1963 లో సమాధి చెందినది. ఈమె సమాధి ఆమె ఇంటి ముందే ఉన్నది. బాబా ఇచ్చిన నాణాములు ఇప్పటికీ భక్తులు చూసేందుకు ఆమె మనుమరాలు భద్రంగా ఏర్పాటుచేసి ఉన్నది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|