|
|
Articles: TP Features | నాయకులను నిలదీయాలి - Dr. Ramesh Babu Samala
| |
భాష విషయమూ అంతే. అసలు స్వాభిమానం అనేది మొదలయ్యేది భాష దగ్గర. మానవుడు నేను, నాది అని తెలుసుకొనేదీ, చెప్పేదీ భాష మూలంగానే. తన భాషను ప్రేమించని మనిషి ఉండడు. తెలుగుజాతికి తెలుగు మీద ఇష్టత, ప్రేమ ఉండదని అనడం తప్పు. కాని సామాజికమైన, ఆర్థికరమైన, రాజకీయమైన అవసరాలకు దాని ఉపయోగాన్నిబట్టి దాన్ని వినియోగిస్తాడు. ఆ అవసరాలకు తన భాష పనికిరానిదైనప్పుడు దాన్ని తన ఇంటి వరకో బంధువుల వరకో పరిమితం చేసుకొంటాడు. ఆ విధంగా అతడి భాష కుంచించుకు పోవడానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక శక్తులు కారణం కాదా? అంటే మన ప్రభుత్వాలు, మన వ్యవస్థలూ, మన మేధావులూ కాదా?
అందుకే భాషోద్యమం స్వాభిమానోద్యమంగా బలపడాలి. అప్పుడే అది ప్రాణంతో ఉంటుంది.
ఎన్నికలు వస్తున్నాయి. పార్టీలు, వాటి నాయకులు వోట్లు అడుగుతూ రోడ్ల మీద షోలు చేస్తున్నారు. పోటాపోటీగా తొడలుకొడ్తూ మీసాలు మెలేసుకొంటున్నారు. ఒకరినొకరు బహిరంగంగా తిట్టుకొంటున్నారు. అయితే ఇదంతా వాళ్లందరూ తెలుగులోనే చేస్తున్నారు. ఎందుకంటే బాగా చెప్పగలిగేదీ, జనానికి అర్ధమయ్యేదీ తెలుగులోనే. అందుకనే ఎన్నికల ప్రచారమంతా తెలుగు మాటల్లో, తెలుగు పాటల్లో జరిగిపోతూ ఉంది. అధికారానికొచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు అర్థంకాని భాషలో పరిపాలిస్తారు. ఎందుకంటే జనానికి పరిపాలన పూర్తిగా అందుబాటులోకి రాకూడదనే దురుద్దేశ్యం వల్ల. ప్రభుత్వ పాలనే కాదు, న్యాయపాలన కూడా ఇంతే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|