|
|
Articles: TP Features | 'గొట్టాల' విప్లవం! - Mr. Narsing rao D
| |
వార్తా చానల్స్ మూడు పువ్వులు, అరడజను కాయలుగా విరాజిల్లుతున్న కీర్తిని కూడా ఆంధ్రప్రదేశే మూటగట్టుకుంది. ఇప్పటికే 'గొట్టాల' మధ్య పెరిగిపోయిన పోటీ అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 'బ్రేకింగ్ న్యూస్'లో ఒకరికంటే మరొకరు ముందుండాలన్న తాపత్రయం కారణంగా అనేక సందర్భాలలో గొట్టాలు విచక్షణ కోల్పోతున్నాయన్నది సత్యం. గొట్టాల మోజులో చిక్కుకున్న ప్రజలు సైతం గొట్టం వలన సంభవించే అనర్ధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంఘటనలు లేకపోలేదు. పోటీ తీవ్రతరం కావడం వలన వార్తలోని సత్యాసత్యాలను నిర్ధారించుకునేంత ఓపిక, నిగ్రహం వార్తా చానళ్ళలో క్రమేపీ కొరవడుతోంది. అనేక సందర్భాలలో ఈ చానళ్ళు ప్రసారం చేసే అవాస్తవమైన స్క్రోలింగ్స్ కారణంగా జనసామాన్యం తల్లడిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. జర్నలిజం నియమాలు, నిబంధనలను తుంగలో తొక్కుతున్నందున వీటి బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వేచ్ఛ హక్కును గొట్టాలు కాలరాస్తున్నాయన్న అభిప్రాయం క్రమేపీ బలపడుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు నేలను ఉద్ధరించి సమాజానికి మార్గదర్శనం చేస్తామని ముడుపు కట్టి గర్భం దాల్చిన ఇంకా అనేక తెలుగు వార్తా చానళ్ళు ప్రసవానికి రోజులు లెక్కపెడుతున్నాయి. గర్భ విచ్ఛిత్త కాకుండా విజయవంతంగా ఈ చానళ్ళు కూడా నిరంతరం వార్తా ప్రసారాలు ప్రారంభించిన రోజున తెలుగునాట 'గొట్టాల విప్లవం' సంపూర్ణం కాగలదు. 'గొట్టం ద్వారానే విప్లవం సాధ్యం' విప్లవం వర్ధిల్లాలి.
ఇప్పటికి మెరుగైన సమాజం కోసం అహర్నిశలు పాటు పడుతున్న చానళ్ళు......
*టివీ 9, *టీవీ 1, *ఈటీవి 2, *టీవీ 5, *ఎన్ టీవీ, *జెమినీ టీవీ, *తేజ టీవీ, *మా టీవి, *లోకల్ టీవి, *హెచ్ ఎం టీవి, *ఐ న్యూస్, *రాయుడు టీవి (ఆర్ టీవి),
త్వరలో పురుడుపోసుకుంటాయని ఆశిస్తున్న తెలుగు వార్తా చానళ్ళు......
*సాక్షి టీవి, *మహా టీవి, *స్టూడియో ఎన్, *జీ 24 గంటలు, *ఆసియా నెట్, *ఆంధ్రజ్యోతి టీవి, *సత్య టీవీ, *హెచ్ వై టీవి, *విస్సా న్యూస్.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|