|
|
Articles: Devotion | మహా శివరాత్రి మహత్యం - Site Administrator
| |
లలాటాక్షుడు అందుకు సంతసించాడు. 'మహా శివరాత్రి ఇహపర ఈప్సితాలను ఈడేరిస్తుంది. భక్తితో నన్నారాధించిన వారు శివసాయుజ్యం పొందుతారు. శివ చరణాలను శరణు జొచ్చిన వారికి మోక్షం సిద్ధిస్తుంది' అని కైలాసాధీశుడు వరమిచ్చాడు. అప్పటి నుంచి ఈ పుణ్య సమయం 'మహాశివరాత్రి'గా ప్రసిద్ధి చెందింది.
మహాలింగోద్భవం
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం.
శివుడు లింగాకారుడు. శివాలయాల్లో లింగమే పూజార్హమైంది. నటరాజ విగ్రహానికి పూజలు అరుదు. శివభక్తులు లింగాన్నే అర్చిస్తారు. శివలింగం మహాశక్తిమంతం. శక్తివంతమైన శివలింగం మహాశివరాత్రినాడు అర్థరాత్రి ఉద్భవించింది. ఆ కాలాన్ని లింగోద్భవ కాలమంటారు. ఇందుకు ఒక పురాణగాథ ఉంది.
ఒకప్పుడు హరికి, బ్రహ్మకూ వాగ్వివాదం జరిగింది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్ధితికారకుడు. మరి ఆదిపురుషుడు ఎవరని సంశయం కలిగింది. చర్చ జరిగింది. చివరికి అది యుద్ధానికి దారి తీసింది. వారి యుద్ధం జగత్ కంటకమైంది. లోకాలు భీతిల్లాయి. దేవతలు సైతం తల్లడిల్లి తటిల్లతల్లా వణికిపోయి శివుని శరణుజొచ్చారు. ఈ యుద్ధం నుంచి కాపాడమని ప్రార్ధించారు. అప్పుడు శివుడు జ్వాలాస్తంభంగా మారి హరి, బ్రహ్మల మధ్య ప్రత్యక్షమయ్యాడు. శివుడు వారితో 'ఈ జ్వాలా స్తంభం ఆద్యంతాలను ఎవరు కనుగొనగలరో వారే ఆదిపురుషుడవుతారు' అని చిన్న పరీక్ష పెట్టారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|