|
|
Articles: TP Features | స్విస్ ఖాతాల గుట్టు రట్టు - Mr. Narsing rao D
| |
ఎల్ టిజి బ్యాంక్ లోని 700 మంది రహస్య ఖాతాదారుల వివరాలను జర్మనీ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సేకరించింది. ఈ సమాచారం ఆధారంగా వందలాది మంది పన్ను ఎగవేతదారులను జర్మన్ ప్రాసిక్యూటర్స్ కొద్ది రోజుల నుండి విచారిస్తున్నారు. అయితే 1400 మంది ఖాతాదారుల సమాచారాన్ని జర్మనీ గూఢచార సంస్థ దొంగిలించినట్లు ఎల్ టిజి ఆరోపిస్తోంది. ఆ ఖాతాదారుల్లో 600 మంది మాత్రమే జర్మని దేశస్థులని ఆ బ్యాంక్ తెలిపింది. తమ వద్ద ఉన్న ఎల్ టిజి సమాచారాన్ని ఏ దేశమైనా ఉచితంగా వినియోగించుకోవచ్చని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది.
భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినప్పటికీ జర్మనీ ప్రభుత్వం వద్ద ఉన్న రహస్య ఖాతాల వివరాలను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం సిద్ధపడలేదు. ఈ విషయంపై సుదీర్ఘకాలం జర్మనీ ప్రభుత్వాన్ని భారత్ సంప్రతించకపోవడం విచారకరం. ప్రతిపక్షాల ఒత్తిడి మూలంగా జర్మనీ ప్రభుత్వానికి మొక్కుబడిగా భారత ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దానికి జర్మనీ ప్రభుత్వ స్పందన వివరాలను భారత ప్రభుత్వం ఇంతవరకు బహిర్గతం చేయలేదు. అంటిగువా, స్విట్జర్లాండ్, బహమాస్, లిక్టన్ స్టెయిన్, ఐల్ ఆప్ మ్యాన్, సెయింట్ కిట్స్ వగైరా విదేశీ బ్యాంకుల్లో లక్షలాది కోట్ల డాలర్ల భారతీయుల డబ్బు మురుగుతున్న విషయం జగమెరిగిన సత్యం.
నెహ్రూ 'సోషలిజం' కాలంలో ఎగుమతులు అండర్ ఇన్వాయిసింగ్ (ధర తక్కువగా చూపించడం), దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్ (ధర అధికంగా చూపించడం) లాంటి చర్యలు సర్వ సాధారణంగా జరుగుతుండేవి. దాంతో ఇన్నేళ్లుగా గణనీయమైన విదేశీ మారకద్రవ్యం ఇలాంటి సంపద ఖానాలకు (నేల మాళిగలకు) తరలిపోయింది. సోషలిజం విధానాల్లో భాగంగా కుల మతాలకు అతీతంగా వ్యాపార, రాజకీయ, సినీ, రంగస్థల, ఆటస్థల, సైనిక ప్రముఖుల సంపాదనలన్నిటిపైనా సంపద పన్నులుంటాయి. దాంతో ఈ పన్నుల బాధను తప్పించుకునేందుకు ఈ ప్రబుద్ధులు తమ సంపాదనను చట్టవిరుద్ధంగా విదేశీ బ్యాంకుల్లో రహస్యంగా దాచుకునేవారు. అదే సమయంలో పలు రక్షణ ఒప్పందాల్లో రాజకీయ నాయకులకు, సైనికాధికారులకు ముట్టే కమీషన్లను సైతం విదేశీ బ్యాంకుల్లోకి రహస్యంగా తరలించారు. ఉన్నతాధికారులు, కళాకారులు కూడా విదేశాల్లో తమ సంపదను దాచుకునేవారు. రూపాయి విలువ పెరిగితే ఈ వర్గాలు ఎక్కువగా నష్టపోతాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|