|
|
Articles: TP Features | తెలుగునాడు - రేడు - Editor
| |
ఇతడు చోళుల (అంటే ఉత్తరార్కాడులోని) కు రాయబారి కూడా! పాండ్యుడి దగ్గరకు దూతగా కూడా వెళ్ళాడు. ఇక్కడ మాట సాయం చేయడానికీ, అంటే రాజనీతి చెప్పటమా లేక పోరు పథకాన్ని తయారుచేయటమా ఏదన్నది సరిగా తెలియకపోయినా రాయబారిని పంపి రాచకార్యాల్లో సహాయం చేసే స్థితిలో ఉన్న నాగరాజు పేరైనా చెప్పకపోవడం మాత్రం తెలుగువారికి జరిగిన అన్యాయమే!
తెలుగునాడును ఏలిన రేడులుగా సంగసాహిత్యం పేర్కొంటున్న వాళ్ళల్లో ప్రముఖులు నాగులు. నాలార్ > నాలైను ఏలిన నాగన్. ఈ నాలార్ ఎక్కడుంది? ఇదేం ఊరు? ప్రస్తుతపు అరుప్పుకోట్టై దగ్గర్లో ఉంది. నాగులు ఆంధ్రులని ఎందరో చరిత్రకారులు స్పష్టపరిచారు. ఆంధ్రజాతిలో కలిసిపోయిన జాతుల్లో ఈ నాగులు ఒకరు. మరి ఈ నాగులు ఆంధ్రులైతే అరుప్పుకోట్టై దాకా వెళ్ళి రాజ్యాన్ని ఎలా స్థాపించారు? అంత దక్షిణాన రాజ్యాన్ని స్థాపించుకొన్న నాగుల బలం గురించీ, వారి రాజ్య పరిపాలనా దక్షత గురించీ పట్టించుకునే చరిత్రకారులేరీ?
పుఱనానూఱులో కన్పిస్తున్న అదియమాన్ లేదా సత్యపుత్రుడు పవత్తిరి పట్టణాధిపతి. పవత్తిరి పట్టణం ఈనాటికీ పావులత్తేరి అనే కుగ్రామంగా మిగిలే ఉంది. ధాన్యకటకం ప్రసక్తి, అస్మక, ములక దేశాలు బౌద్ధ ధర్మానికి నెలవైన తెలుగు నాటిలో భాగాలే!
శ్రీ షట్టర్ తన 'శంగంతమిళగం మత్తు కన్నడ నాడు - నుడి' లో 'ఇల్లి బరువ ఉఱిందై చోళర రాజధాని ఉఱైయూరు, మదురె పాండ్యర రాజధాని మదురై, వజ్ఞచేరర రాజధాని కరువూరు, మగారో ప్రసిద్ధ బందరు పట్టణం, కావేరిపూం పట్టణం అధవా పూంపుగార్' (పు.36) అని పేర్కొన్నారు. ఇందులో మనకు ఆసక్తి రెండింటి పట్లే. ఒకటి చోళుల ఉఱైయూరు, రెండోది ఏలిక పేరులేని బందరు. చోడుల ఉఱైయూరు ఏది? చోడ బల్లిదేవుడి కుమారుడైన నన్నెచోడుడు చెప్పుకున్న ఉఱైయూరేనా! మరొకటా! కొందరు చరిత్ర ఆచార్యుల ప్రకారం ప్రస్తుతపు కోయంబత్తూర్ జిల్లా ప్రాంతాలే ప్రాచీన ఉఱైయూరు - చోడులు పాలించిన ప్రాంతం. శ్రీ షట్టర్ 'ఉఱైయూర్' పట్టణదింద ఆళిద చోళరిగంతూ కావేరి జీవనాడియే ఆగిత్తు (పు.99) అంటారు. చరిత్ర అధ్యాపకులు చెప్పేదానికీ, దీనికీ పొత్తు కుదరటం లేదు. నన్నెచోడుడి ఉఱైయూర్ ఉత్తర ఆర్కాడు జిల్లాలోనిది. మన చరిత్ర అధ్యాపకులు పరిశోధకులూ కలిసి నిగ్గు తేల్చాల్సిన విషయం ఈ ఉఱైయూర్, చోళుల ఉఱైయూరు ఏది అన్నది? తమిళదేశానికి ఉత్తరాన ఉన్న 'వడుగర్'లలో కన్నడిగులు ఉండవచ్చు. ముఖ్యంగా కొడగు మహిషపురాల గురించీ, కావేరి జన్మస్థలం గురించీ వచ్చే ప్రస్తావనలన్నీ కన్నడ దేశాన్ని సూచించవచ్చు కానీ, వడగు అంతా వారిదే కాదు. కన్నడం కన్నా దాదాపు శతాబ్ది పైచిలుకు ముందే మనకు తెలుగులో యక్షగానాలున్నా ఆ ప్రక్రియనే వారికి ధారాదత్తం చేసిన మనం ఈ చోడుల ఉఱైయూర్ ను కూడా ఇచ్చేస్తే ఇక తెలుగు రేడులంతా పరాయివారే అన్న మాట మరింత బలపడుతుంది. తెలుగునాడు - రేడులు తెలుగుతనానికీ జాతికీ గర్వకారణం. వారి చరిత్ర తప్పక తెలుసుకోవలసిన విషయం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|