|
|
Articles: TP Features | మన భాష...భవిష్యత్తు - Dr. Ramesh Babu Samala
| |
ఇక్కడొక సంగతిని స్పష్టంగా చెప్పుకోవాలి మనం. తెలుగుజాతికి సంబంధించినంతవరకు చిత్రపటంలో చూపిన భాగాలన్నీ ఒకే రాష్ట్రంగా వుండాలని కోరుకునే వారెవరూ ఉండరు. ఏ కారణం చేతనైనా నేటి ఆంధ్రప్రదేశ్ కూడా రెండు మూడు రాష్ట్రాలైనా చేయగలిగిందేమీ లేదు. కాకపోతే, సంఖ్యాపరంగా అధికంగానో అల్పంగానో ఉన్న ప్రతిచోటా తెలుగువారు పరస్పరం ఆదరించుకోవాలి, సహకరించుకోవాలి. తమదైన విశిష్టమైన సంస్కృతిని కాపాడుకోవాలి. ఇందుకు అందుబాటులో వున్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. అవసరమైతే పోరాటాలకూ సిద్ధపడాలి.
మన భాషకు మన రాష్ట్రం కంచుకోట కాలేకపోయంది. ప్రజాస్వామ్యానికీ మానవీయతకూ భంగం కలిగించే స్థాయిలో తెలుగు ఇంటా బయటా అన్యాయమైపోతోంది. ఆ విధంగా తెలుగుజాతి వర్తమానం, భవిష్యత్తూ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తెలుగు ప్రజల నాయకులు, మేధావులు, భాషోద్యమకారులు ఇదంతా గుర్తించాలి. విశాలంగా, సమగ్రంగా ఆలోచనలు సాగాలి. ఆచరణాత్మకంగా మనం ఈ సందర్భాన్ని మనలో ఆవేశింపజేసుకోవాలి. మనజాతి చాలా గొప్పది అనీ, మనం చాలా తెలివిగలవారమనీ అనుకొంటే చాలదు. హెచ్చు తగ్గుల భావనలను ఏ విధంగానూ దరిచేరనీయకుండా, 'ప్రతి తెలుగు మనిషీ మన తోబుట్టువే'నంటూ జాతితో కలిసి ముందుకు నడవాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|