|
|
Articles: TP Features | తెలుగుభాష రక్షాబంధనం - Mr. Tirumalarao Jayadheer
| |
నాందేడ్ జిల్లాలో మాలేగాం ఊళ్ళో జరిగే ఒక పెద్ద సంతకి వెళ్ళండి. ఎన్ని రకాల తెలుగు! ఎన్ని మహారాష్ట్ర జిల్లాల నుండి తరలివచ్చిన తెలుగు వింటారు మీరక్కడ! ఖండోబా గుడి మెట్ల మీదకు వెళ్ళండి. ఆ మెట్ల మీద ఇక్కడ పెద్దమ్మలవారు కొట్టుకునే చెర్నాకోలతో కనిపించే శంభోజినా గోరావ్ ని కలవండి. ఆప్యాయంగా పలకరించండి. తనని వార్ వారు అని పిలుస్తారని చెబుతారు. 'వారు' అంటే తాడు అని అర్థం. ఆ తాడునే వృత్తిగా కలిగిన మరాఠేతర కులాన్ని 'వార్' అని పిలుస్తారు. వెరసి అతడు వార్ వార్!
శంభాజీ వార్ వార్ ని మరింతగా పలకరించండి. ముందరి ఇంటి పేరో చివరి పేరో అడగండి తన పేరు చివర 'తెలంగి' అని ఉంటుందని గర్వంగా చెబుతాడు. చివరకు ఆ తెలంగి - తెలుగు శబ్దం నుండి వచ్చిందని అతనికి తెలియదు. తాను మరాఠావాడు కాదని ఎవరన్నా అన్నా ఒప్పుకోడు. కాని మరాఠా సంప్రదాయంలో బయటి మూలాలు కలిగిన వారిని ఇంటి పేరో, ఒంటి పేరో, ఊరు పేరో దేనికైనా చివరగా 'వార్' అని తగిలిస్తారు. నోముల అని ఇంటి పేరుని బట్టి నోముల్ వార్ అని అంటారు. ఇలాంటి 'వార్' కలిగిన వాళ్లలో అత్యధికులు తెలుగువారే. ఈ 'తెలంగి' వారిని మన దగ్గర 'మాతంగి' వారని పిలుస్తాం.
ఈ సారి డిసెంబర్ 31 తేదీ రాత్రి కుటుంబ సభ్యులతోనో, సన్నిహిత మిత్రులతోనో కాకుండా పరప్రాంతంలోని తెలుగు సోదరులతో కలిసి ఖుషీ చేయాలనుకున్నాను. కొత్త ఆంగ్ల ఏడాదిని వారితో కలిసి ఆహ్వానించాలనుకున్నాను. ఈలోగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న మా పరిశోధక విద్యార్థి భుజంగరావ్ బోబ్డే ఫోనులో చెప్పాడు - మాలేగాం సంత గురించి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద సంతల్లో అదొకటి. వేలాది గుర్రాలు, గాడిదలు, పశువులు, పక్షులు అక్కడ చేరతాయి. వాటిని కొనేవారు అమ్మేవారితో సందడిగా ఉంటుంది.
మాలేగాం చిన్న గ్రామం. కాని దాని చుట్టురా నాలుగు చెరువులున్నాయి. అందుకే కాబోలు వందలాది ఏళ్ళ కిందట నుండి సంత జరిగే ఏర్పాట్లు చేశారు. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. ఐతే నా కోర్కె ఏమంటే మహారాష్ట్రలో ఉన్న తెలుగు ఉపకులాల వారు అక్కడికి వస్తారు - వాళ్ళతో గడపాలని ఉబలాటపడ్డాను.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|