|
|
Articles: TP Features | 'స్విస్' గుట్టు విప్పేనా? - Site Administrator
| |
ఒబామా ప్రభుత్వం కోరుతున్నట్టు యుబిఎస్ తమ అమెరికన్ ఖాతాదారుల గుట్టు బయటపెడితే మొత్తం స్విస్ బ్యాంకింగ్ వ్యవస్థే దివాలా తీస్తుందని, వాటిని నమ్మి అక్కడ డబ్బుఇక ఎవరూ దాచిపెట్టుకోరని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుచేత స్విస్ ఖాతాల అసూర్యంపశ్యత, అతి గోప్యత అలాగే కొనసాగుతుందని, వాటి గుట్టురట్టు కావడమనేది ఎండమావిలా భ్రమింపచేస్తూ ఎన్నికల వాగ్దానంగా ఉపయోగపడుతూనే ఉంటుందని వారు భావిస్తున్నారు.
2002 నుంచి 2007 వరకు ఐదేళ్ళ కాలంలో 20 బిలియన్ డాలర్ల మేరకు అమెరికా ఖాతాదార్లు తమ గుప్తధనాన్ని యుబిఎస్ బ్యాంకులో జమచేశారని, దీనిపై 300 మిలియన్ డాలర్ల మేరకు అమెరికా ప్రభుత్వానికి కట్టవలసిన పన్నును వారు ఎగరవేశారని ఈ సొమ్ము మీద యుబిఎస్ కు 200 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని సమాచారం. స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న భారతీయ ఖాతాదార్ల సొమ్ము 1500 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేరకు ఉంటుందనేది ఒక అంచనా. వికిపీడియా సమాచారమంటూ అద్వానీ చెప్పిన భారతీయ స్విస్ ఖాతాల కిమ్మత్తే 285 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ పాపాల భైరవులందరి సొమ్ముకీ సురక్షిత గమ్యంగా ఉన్న స్విస్ బ్యాంకు ఖాతాల కుంభస్థలాన్ని కొట్టి ఆ సంపదనంతటినీ రాబట్టి ప్రజావసరాలకు ఉపయోగించిన రోజున నిజంగానే విశ్వసమాజం నిండుగా నవ్వుకుంటుంది. పండగ చేసుకుంటుంది.
స్విస్ బ్యాంకులలో మొత్తం అమెరికన్ ఖాతాలు 50 వేల వరకు ఉంటాయని ఒక అంచనా. బోఫోర్స్ కుంభకోణంలో స్విస్ ఖాతాలలో జమ అయినట్టు భావించిన కొద్ది కోట్ల రూపాయల కళంకిత ద్రవ్యం సమాచారం రాబట్టి న్యాయస్థానం ఎదుట రుజువు చేయడమే సాధ్యం కాలేదు. జి.-20 వంటి సంపన్న, వర్ధమాన దేశాల వేదికల మీద ఈ అంశాన్ని చర్చనీయాంశం చేసి స్విస్ ఖాతాల మెడలు వంచడానికి గట్టి గృషి జరగాలి. ఇందుకు దృఢమైన రాజకీయ సంకల్పం ఎంతైనా అవసరం.
(సూర్య సౌజన్యంతో)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|