|
|
Articles: My Thoughts | చరిత్ర విజ్ఞాన శాస్త్రమా? - Site Administrator
| |
అలాగే ఆసియా ఈశాన్య ప్రాంతపు కొసకూ అలాస్కాకూ మధ్య బెరింగ్ జలసంధి ఉండేది కాదు. ఈ కారణంగా కొన్ని ప్రాంతాలకు ప్రజలు కాలినడకన వలసపోగలిగారు. మరికొన్ని చోట్ల పడవల తయారీ జరిగిన దాకా సంపర్కం ఏర్పడలేదు. ఇవన్నీ నాగరికత అభివృద్ధినీ, వ్యాప్తినీ చాలా ప్రభావితం చేశాయి.
చరిత్రను విజ్ఞానంగా పరిగణించగలమా? అసలు శాస్త్రవిజ్ఞానానికీ చరిత్రకూ తేడాలేమిటి? విజ్ఞాన శాస్త్రాలకు కొన్ని సూత్రాలుంటాయి. అవి సర్వత్రా వర్తిస్తాయి, లేదా పరిస్థితులను బట్టి కొన్ని మినహాయింపులుంటాయి. అందువల్ల ప్రయోగ ఫలితాలను నిక్కచ్చిగా ఊహించి చెప్పవచ్చు. పైకెగరేసిన బంతి భూమిమీదా, చంద్రుడిమీదా ఎంత వేగంతో వచ్చిపడుతుందో లెక్కకట్టవచ్చు. భౌతిక, రసాయన శాస్త్రాలకిది వర్తిస్తుంది కాని, జీవశాస్త్రం వంటి వాటిలో పెద్ద ఎత్తున సేరించిన సమాచారాన్ని బట్టి స్థూలంగా మాత్రమే అంచనా వెయ్యవచ్చు. ఎందుకంటే అటువంటి నమూనాల్లో మార్పు చెందగలిగిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మూల భౌతిక ప్రేరణల్లోని స్వల్ప వ్యత్యాసాలు విభిన్న ఫలితాలని కలిగిస్తూ ఉంటాయి.
చరిత్ర వంటి విషయాల్లో ఇది మరీ అసాధ్యం అనిపిస్తుంది. వీటిలో సామాన్యంగా గడిచిపోయిన విషయాలని శాస్త్రీయంగా వివరించడం సులువుగా అనిపిస్తుందిగాని, ముందుగా ఊహించి చెప్పడం కష్టమే. జరిగిన సంఘటనల్లో వ్యక్తుల పాత్ర లేదని కాదు. ఉదారహణకు దండయాత్రలు ఏ కారణం వల్ల జరిగినప్పటికీ వాటిని ముందుండి నడిపిన అలెగ్జాండర్, చెంఘిజ్ ఖాన్, నెపోలియన్, హిట్లర్ తదితరుల సాహసం, స్వభావం, శక్తి సామర్థ్యాలూ మొదలనవన్నీ చరిత్రని తీవ్రంగా ప్రభావితం చేసిన మాట నిజమే.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|