|
|
Articles: TP Features | లెక్క తేల్చేది కులాలే! - Site Administrator
| |
ఆనాడు 1983లో ఎన్.టి.రామారావు పార్టీని స్థాపించి అనామకులకు టికెట్లు పంపించినప్పుడు పత్రికలు, సర్వే సంస్థలు ఆయన చేసిన పనిని వెర్రి ప్రయత్నంగా కొట్టి పారేశాయి. తాను అధికారంలోకి వస్తానని ఎన్.టి.ఆర్ కూడా నమ్మలేదు. కొత్తగా బీసీలకు టిక్కెట్లు ఇవ్వడం, రాజకీయానుభవం ఉన్న కాంగ్రేసేతర కుటుంబాల వారికి టిక్కెట్లు ఇవ్వడం అనే ప్రక్రియకు ఎన్.టి.ఆర్ కరిష్మా తోడయి ఆనాడు ప్రజలు ఆయనను గెలిపించారు.
నేడు ఆంధ్రప్రదేశ్ లో బహుముఖ పోటీ నెలకొన్నది. మెజార్టీ ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నా ఇప్పుడున్న పద్ధతిలో పోటీ చేసిన వారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వారే విజేతలు. 2004 లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 543 మందిలో 324 మంది పోలయిన ఓట్లలో సగంకన్నా తక్కువ ఓట్లతో గెలిచారు. 2004 ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లలో 59 మంది ఎం.పీలు 20 శాతం కన్నా తక్కువ ఓట్లతో గెలుపొందారు. మొన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా సరే కేవలం 28-30 శాతం ఓట్లతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యింది. యూపీలో రాబర్ట్ గంజ్, మోహన్ లాల్ గంజ్, బస్తి తదితర నియోజకవర్గాల్లో '12 శాతం' కన్నా తక్కువ ఓట్లు వచ్చినవారు కూడా ఎం.పీలుగా గెలుపొందారు.
అక్కడ పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ లో కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక్కో స్థానానికి సగటున 12 మంది అభ్యర్థులు, 7 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎవరికి ఉంటుందో వారే గెలుస్తారు. యాంటీఇన్ కంబెన్సీ (ప్రభుత్వ వ్యతిరేకత) ఓటు, పాజిటివ్ ఓటు, నెగెటివ్ ఓటు, విమెన్ ఓటర్స్, యంగ్ ఓటర్స్, ప్రెష్ ఓటర్స్, అర్బన్ ఓట్, రూరల్ ఓట్, ఎస్సీ ఓట్, ఎస్టీ ఓట్, మిడిల్ క్లాస్ ఓట్, స్లమ్ ఓట్, ట్రైబల్ ఓట్, ఇలా ఓట్లను రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారు విడదీసి చూస్తారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత తీరిగ్గా లెక్కలు చూసుకోడానికే ఈ శాస్త్రం ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ ఓట్లను డబ్బాలో పడగొట్టడానికి ఈ శాస్త్రం అంతగా ఉపకరించదు.
ఓటరు ఎప్పుడు, ఎలా నిర్ణయించుకుంటాడు : అసలు ఓటరు తను ఎవరికి ఓటు వేయాలనే విషయాన్ని ఎప్పుడు నిర్ణయించుకుంటాడు. ఏయే అంశాల మీద ఆధారపడి నిర్ణయించుకుంటాడు అనే విషయమై శాస్త్రం ఇప్పటి వరకు ఒక నిర్థారణకు రాలేదు. స్థానిక సమీకరణాలు, ఓటరుకున్న విచక్షణ, విజ్ఞతల మేరకు ఓటరు ఎవరికి వోటు వేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. పార్టీ కార్యకర్తలు, సిద్ధాంతాన్ని నమ్మేవారు అభ్యర్థి ఎవరున్నా ఆ పార్టీకి ఓటు వేస్తారు. వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కాని వీరినే పార్టీలు బలం, నిర్మాణం అని పేర్కొంటారు. వీరు ఐదు శాతం కూడా ఉండరు. నిజానికి ఓటు బ్యాంకు వేరుగా ఉంటుంది. ఏ పార్టీకి చెందని న్యూట్రల్ ఓటర్లు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ధారిస్తాయి. దీన్ని ఓటు బ్యాంక్ గా పేర్కొనవచ్చు. వీరి మనస్సుల్లో ఏముందో తెలుసుకోవడం కష్టం. అందుకని ఏ శాస్త్రీయ సర్వే అయినా కొద్ది మేరకు ఓటర్ల ధోరణిని వెల్లడించ గలదేమో కాని మొత్తం ఓటరు మనస్సును విప్పి చూపలేదు. చాలా మంది న్యూట్రల్ ఓటర్లు ఎన్నికల రోజు, ఓటు వేయడానికి వరుసలో నిలబడి కూడా ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి వారే కీలకం. వీరే గెలుపు, ఓటములను నిర్ణయిస్తారు.
గత ఎన్నికల్లో పార్టీల వారిగా చూస్తే కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం పార్టీకీ ఓట్లు తక్కువ ఏమీ రాలేదు. 2004 ఎన్నికలలో మొత్తం 3.57 కోట్ల ఓట్లు పోలవగా కాంగ్రెస్ పార్టీకి 1.38 కోట్లు (38.56శాతం) ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 1.34 కోట్లు (37.58శాతం) ఓట్లు పోలయ్యాయి. కాని పొత్తుల వల్ల కాంగ్రెస్ పార్టీకి 5 శాతం ఓట్లు ఎక్కువ తోడై ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|