|
|
Articles: TP Features | అమ్మకానికి వార్తలు! - Site Administrator
| |
కేవలం ప్రకటనల ద్వారా జరగాల్సిన అభ్యర్థుల ప్రచారం ఇలా వార్తలు కాని వార్తల ద్వారా సాగితే అది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసినట్టు కాదా? ఆర్థిక బలం లేక అలాంటి ప్రకటనలు ఇచ్చుకోలేని అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీసినట్టు కాదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు పత్రికా యాజమాన్యాలకు తెలియవని కానీ, వాటి ప్రచురణలో వారు చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తున్నారని కానీ ఎవ్వరూ అనుకోరు.
ప్రకటనల రూపంలో ఇలాంటివి వస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. ప్రజలు కూడా అవి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా భావించి తాము తీసుకోవలసిన నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ వార్తల రూపంలో వస్తే మాత్రం ప్రజలు వాటిని విశ్వసించి తప్పుడు నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంటుంది. సమాజానికి ఎన్నో నీతులు ప్రవచించే పత్రికాధిపతులకు ఈ విషయం తెలియదా? డబ్బులు తీసుకున్న కృతజ్ఞతతో వార్తల స్పేస్ ను అభ్యర్థులకు ధారాదత్తం చేసిన యాజమాన్యాలు పాఠకులకు ఏ విధమైన సేవ చేస్తున్నట్టు?
పత్రికల్లో రాసిన ఇలాంటి వార్తలకు విరుద్ధమైన ఫలితాలు వస్తే పత్రికలు తమ పాఠకులకు ఏమని సమాధానం చెబుతాయి? పత్రికలపై తాము పెట్టిన కోట్లాది రూపాయల పెట్టుబడిని రాబట్టుకోవడానికి ఇలా చేస్తే తప్పేమిటన్న పత్రికల వాదన ఎంత మాత్రం సమర్థనీయం కాదు. 2004 సార్వత్రిక ఎన్నికల సందర్భంగానే మొదలైన ఈ వికృత పద్ధతి 2009 ఎన్నికల్లో మరింత పెరగడం శోచనీయం. ఫోర్త్ ఎస్టేట్ గా గౌరవింపబడుతున్న పత్రికారంగం ఇలాంటి ఎన్నికల తరుణంలో నిష్పాక్షికంగా వోటర్లకు దిశా నిర్దేశం చేయాలి. ఓటర్లను చైతన్య పర్చి సరైన ప్రతినిధిని ఎంచుకోవడంలో మార్గ దర్శకత్వం వహించాల్సిన పత్రికలు తాము సామాజిక బాధ్యతను నెరవేర్చ లేకపోతే ఫర్వాలేదు గాని వోటర్లను తప్పుదోవ పట్టించి అయోమయ పరిస్థితిలోకి నెట్టే పద్ధతులకు స్వస్తి చెప్పాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|