|
|
Articles: Devotion | సాయి లీలలు - Mr. Syam Satyanarayana Konduri
| |
ఎందుకయ్యా అనవసరంగా ఆ మార్గంలో పోయి కాలాన్ని వృథా చేశావు అని అందరు అనుకున్నారు. ఏమో నాకు తెలియకుండానే ఈ విధంగా శివాలయం వైపు వెళ్ళింది అని రామయ్యగారి పెద్దకుమారుడు అన్నాడు. ఆ తరువాత నిరాటంకంగా 9 - 10 గంటల మధ్యలో నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నుండి రైట్ కెనాల్ కు వెళ్ళారు. లోగడ అక్కడ ఎన్నో కార్యాలు జరగటం చూచి ఉన్నందున బంధు మిత్రులు వారి కుమారులను అక్కడకు తీసుకుని వెళ్ళారు.
అక్కడికి చాలా మంది విహారయాత్రకు వచ్చి వెళ్ళుతూ ఉంటారు. అదేవిధంగా ఈ విధమైన కార్యాలకు కూడ చాలా మంది వస్తూ ఉంటారు. లోగడ అక్కడ అనేక నిమజ్జన కార్యక్రమాలు జరిగి ఉండటం వలన ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ రోజు కనుమ పండుగ. కనుమ నాడు కాకైనా మునుగుతుందనేది ఒక సామెత. అదేమి ప్రారబ్ధమో కాని ఆనాదు ఆ ప్రదేశంలో జన సంచారమే లేదు. పురోహితుల జాడ అసలే లేదు. పైగా ఆ దరిదాపుల్లో ఉన్న ఆలయాలన్నీ మూసి ఉన్నాయి. రామయ్య కుమారులు వారి వెంట వచ్చిన వారు కూడ నీరసపడి దిక్కు తోచక ఉన్న సమయంలో ఆ పక్కనే రామాలయంలోని ఒక అర్చకుని నివాసానికి వెళ్ళి పరిస్థితి వివరించి వారిని ఆ కార్యక్రమం జరిపించాలని కోరారు. ఆయన అంగీకరించలేదు. ఆ కార్యక్రమాలు జరిపించటం తనకు నిషేధం అని చెప్పారు. ఆ కార్యక్రమాలు జరిపించే పురోహితుదు పండుగ కారణంగా వేరే ఊరు వెళ్ళాడు. ప్రస్తుతం ఎవరూ దొరకరు అని చెప్పారు.
అందరూ ఖిన్నులై ఈ విషయం రామయ్య కుారులకు చెప్పగా చితాభస్మ కలశం తీసుకొని వెనక్కి వెళ్ళేందుకు నిశ్చయించుకున్నారు.
నిమజ్జనం జరుపకుండా ఆ కలశాన్ని తీసుకుని వెళ్ళటం అరిష్టదాయకం అని వెంట వచ్చిన వారు చెప్పారు. దీనితో ఏమి చేయాలో తోచక నిశ్చేష్టులై ఉండగా రామయ్య గారి అల్లుళ్ళు వారిని అక్కడే ఉంచి మరో ప్రయత్నం చేసేందుకు వెళ్ళారు.
అప్పుడే ఒక విచిత్రం జరిగింది. కొంత దూరం వెళ్ళగా ముందుగా గమనించని సాయిబాబా ఆలయం ఒకటి దూరంగా కనిపించింది. అప్పుడు వారు ఈ పరిస్థితిలో సాయిబాబా తప్ప మరెవ్వరూ సహాయపడేవారు లేరు. సప్తసముద్రాల అవతల ఉండి కూడ బాబా సహాయాన్ని అర్థిస్తే తాను స్వయంగా వచ్చి సహాయపడతానని ఏకాదశ సూత్రాలలో తెలిపిన విషయం తలచుకొని బాబా అనుగ్రహం కోసం మందిరంలోకి వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు. మళ్ళీ సంశయం. వారి కుమారులతో కలిసి వచ్చినందువల్ల ఆలయ ప్రవేశం చేయటం దోషమేమో అని తర్కించుకొని ఒకరు బయట గేటు వద్దనే ఉండిపోయారు. ఇంకొకరు గుడిలోనికి ప్రవేశించకుండా పూజారి కోసం లోపలికి తొంగిచూస్తూ అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలను గ్రహించి పూజారిని పిలిచేందుకు వీలులేక వెనుదిరుగుతూ 'బాబా నీవు ఈ కార్యక్రమం చేయించలేవా... నీ మీదే ఆశ పెట్టుకున్నాం' అని అర్ధిస్తూ గేటు వద్ద నిలబడి ఉన్న తోడల్లుని కలిసి పరిస్థితిని చర్చించుకుంటున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|