|
|
Articles: TP Features | కన్నడంలో 'దేవుడు' - Site Administrator
| |
సంస్కృతి, సమాజం, తత్త్వశాస్త్రం, సాహిత్య మీమాంస మొదలైన వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల దేవుడు గారి రచనలు ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంటాయి. 'కర్ణాటక సంస్కృతి' అనే పేరుతో ఆయన రచించిన గ్రంథం సంస్కృతి స్వరూప స్వభావాల లోతుల్లోకి వెళ్తుంది. 'మీమాంసాదర్పణం' అనే పేరుతో ఆయన రాసిన గ్రంథం తాత్త్విక గ్రంథాలలో అత్యంత శ్రేష్ఠమైనదని పేరు పొందింది.
ఇంగ్లీషు భాషలోనూ, సంస్కృతంలోనూ సమానమైన పాండిత్యం గడించిన మహనీయుడు దేవుడు. 1936లో గాంధీజీ బెంగుళూరికి వచ్చినప్పుడు రాజాజీ ఇంగ్లీషులో చేసిన ఉపన్యాసాన్ని కన్నడానికి వెనువెంటనే అనువాదం చేసిన దేవుడి గారి ప్రతిభని చూచి రాజాజీ 'నా ఇంగ్లీషు కంటె దేవుడు గారి కన్నడమే బాగుంది' అని సభలోనే మెచ్చుకున్నారట.
స్థిత ప్రజ్ఞుడనడానికి దేవుడు నిదర్శనంగా ఉండేవారు. 1958లో ఒక కాలు సెప్టిక్ కావడం వల్ల దాన్ని తీసేయవలసివచ్చింది. ఎంతో మంది సాహితీవేత్తలు 'ఇలా కాకుండా ఉండాల్సింది' అంటే 'ఒక్క కాలే కదా, మరో కాలు ఉండటమే అదృష్టం' అనేవారట ఆయన. ఒంటికాలితోనే ఆయన ఉపన్యాసాలకు వెళ్ళేవారు.
కన్నడ నవల, బాల సాహిత్యం, నాటకాల ప్రయోగం, విద్యాసంస్థల స్థాపన, వయోజన విద్య మొదలైన అనేక రంగాలలో అపూర్వమైన సాధన చేసి పేరుపొందిన దేవడు నరసింహశాస్త్రిగారు 66 ఏట (1962) చనిపోయేవరకు కూడా రచనలు చేస్తూనే వున్నారు. ఆయన రచనల్లో 17 నవలలు, 6 కథా సంపుటాలు, 5 నాటకాలు, 9 పిల్లలల నాటకాలు, 6 పాఠ్యగ్రంథాలు, 8 సంస్కృతం నుండి అనువాదాలు, 5 ఇంగ్లీషు నుండి అనువాదాలు, సుమారు 25 పిల్లల కథా సంకలనాలు, పత్రికలు, పరిశోధనలు, విమర్శలు, సంస్కృతి, చరిత్ర మొదలైన విషయాలకు సంబంధించిన పుస్తకాలున్నాయి.
మన దేవుడు కన్నడ సాహిత్య ప్రపంచంలోనూ దేవుడై వెలిగాడన్నదే విశేషం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|