|
|
Articles: TP Features | నేతిబీరలా ఫిరాయింపు చట్టం - Site Administrator
| |
ఫిరాయింపుల చట్టం ఉండాలంటూ కేంద్ర స్థాయిలో 1969 డిసెంబర్ లో తొలుత ప్రతిపాదించింది తెలుగువాడైన పెండేకంటి వెంకట సుబ్బయ్య.. ఆ తర్వాత అప్పటి హోం మంత్రి వైబి చవాన్ కమిటీ ఇందుకు అనుకూలంగా 1927లో ఒక నివేదిక సమర్పించింది. 1978లో మురార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమోదం పొందింది. చట్టంలోని లొసుగులు ఫిరాయింపును చట్టం ఉపేక్షించదలచుకోలేదు అని ప్రచారం జరుగుతున్నది. 'శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు' అన్నట్లు శత విధాల యోచించి చట్టం చేసేవారు పటిష్ట చట్టాన్ని చేసిన మహా జిత్తులమారి గడసరి రాజకీయ నాయకులు ఏదో రీతిన దానిలోని సాంకేతిక లోపాల వల్ల దీనికి చిక్కకుండా పార్టీలను ఫిరాయిస్తున్నారు. కర్నాటకలో జరిగిన తంతు అందరూ ఎరిగిందే.
ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల మనోభావాలు, భ్రమలు చెదరకుండా ఉండేందుకు ఇలాంటి చట్టాలు వస్తున్నాయి అన్నది ఒక సూత్రీకరణ. భారతదేశంలో అధికారం ప్రజాస్వామ్యం ముసుగులో కొన్ని వర్గాలు, కులాల వారి ఆధీనంలో ఉంది. ఇది ఎవరూ కాదనలేని విషయం అన్నది వామపక్షీయుల ఆరోపణ. ప్రజాస్వామ్యం ముసుగు చెదిరిపోకుండా ఇలాంటి డొల్ల చట్టాలను ఏర్పర్చి వాటి ఛాయలో పాలకవర్గాలు అధికారాన్ని సుస్థిరం చేసుకొంటాయన్నది ఆ ఆరోపణలో అంతరార్ధంగా ఉంది.
న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు మాత్రం నిబ్బరంగా నిబంధనల గురించి చట్టంలోని సాంకేతిక అంశాల గురించి చర్చిస్తూ 'రోకండ్లకు నారలు తూస్తూ' అంతా సవ్యంగా ఉన్నట్లు... చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లు, కోర్టులు అద్భుతంగా పని చేస్తున్నాయి అని ప్రవచిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి అందులో జీవనోపాధి ఉంది. కాని చట్టంతో రాజకీయ వాదులు తమ పనులు చేయించుకుంటారు, అది కూడని నాడు వారు దాన్ని తుంగలో తొక్కేస్తారు. ఈ దేశంలో అరుదుగా మాత్రమే కోర్టులు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలున్నాయి. న్యాయమూర్తుల నియామకాల్లో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ప్రమేయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఏ కులం వాడయితే న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లీడర్లూ ఎక్కువ మంది ఆ కులం వారే నియమితులవుతారు. ఇది బహిరంగ రహస్యం. ఇలాంటి వేల దృష్టాంతాలు స్వతంత్ర భారతదేశంలో మనకు కనిపిస్తాయి. 2009 నాటికి కూడా ఇలాగే జరుగుతున్నది. న్యాయమూర్తుల నియామకంలో ఆశ్రిత పక్షపాతం, కులప్రీతి, లంచాలు, పార్టీలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇలాంటి సందర్భంలో చట్టం అరుదుగా మాత్రమే అమలవుతుంది. ఇది కాదనలేని విషయం. అరుదుగా అమలైన సందర్భాలను సాకుగా చూపి న్యాయ వ్యవస్థ తన నలుపు రంగు 'షేడ్' అవకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఆ నలుపు రంగు గౌను వెనక న్యాయ దేవత కనుల మీద ఉన్న నల్ల పట్టీ వెనుక చిత్ర విచిత్ర వర్ణాల్లో అన్యాయాలు జరిగిపోతూనే ఉన్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|