|
|
Articles: TP Features | మూడో ఫ్రంట్ తో ముప్పు - Site Administrator
| |
మే 16 మధ్యాహ్నానికి అంతా యుపిఎ కనీసం 180 స్థానాల మెజారిటీ సాధిస్తున్నదనే సంకేతాలు వెలువడితే చాలు ఆ రోజు సెన్సెక్స్ వేడి తగిలిన పాదరసంలా జరజరా పైకి పాకుతుంది. ఆ రోజు సెన్సెక్స్ 13 వేల పాయింట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.
యుపిఎ తప్పితే మనకు ఉన్న రెండో ఆప్షన్ బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ. కూటమి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్వే వివరాల ప్రకారం ఎన్.డి.ఎ కూటమికి 176 నుండి 187 సీట్లు వస్తాయి. ఒకవేళ మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చి అధికారం చేపట్టినా మార్కెట్ వర్గాలు హర్షిస్తాయి. 1999 - 2004 మధ్య కాలంలో అధికారం నెరపిన ఎన్.డి.ఎ ప్రభుత్వం మిగతా విషయాలలో ఎలా ఉన్నప్పటికీ పి.వి.నర్సింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల కొనసాగింపు, ఉదారవాద విధానాల వల్ల పెట్టుబడిదారుల మన్ననలు పొందింది. ఈ మారు ఒకవేళ ఎన్.డి.ఎ అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం వెలికితీయడం, ఆదాయపు పన్ను పరిమితిని 3 లక్షల రూపాయల వరకు పెంచడం, నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులు చేపట్టడానికి తప్పక నడుం బిగిస్తుంది. ఇదే జరిగితే మార్కెట్ లో డబ్బు వెల్లువెత్తుతుంది. దాంతో పెట్టుబడులు పెరగడం సహజం. నల్లధనం వెలికి రావడంతో పెట్టుబడుల పట్ల జనంలో ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు డిపాజిట్లు పెరుగుతాయి. దాంతో బ్యాంకులు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులను పెంచుతాయి. ఫలితంగా మార్కెట్ వేగవంతం అవుతుంది.
ఇక ఎన్.డి.ఎ ప్రభుత్వం నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపట్టడం అంటూ జరిగితే సిమెంటు, స్టీలు ఇన్ ఫ్రా కంపెనీలకు పంట పండినట్టే. ఆ షేర్లు మార్కెట్ లో రాకెట్లలా దూసుకుపోతాయనడంలో సందేహం లేదు. ఒకవేళ మే 16న ఎన్.డి.ఎ కూటమి మెజారిటీ సంకేతాలు వెలువడితే ఈ షేర్లను అందుకోవడం కష్టమే అవుతుంది. అప్పుడు కూడా మార్కెట్ ఉప్పెనలా ఎగిసిపడడం ఖాయం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|