|
|
Articles: My Thoughts | చెట్ల వెక్కిరింత - Site Administrator
| |
ప్రస్తుత విద్యుత్ కొరతకి ఏకైక పరిష్కారం అమెరికాతో అణుఒప్పందం అన్నాడు మన ప్రధాని మన్మోహన్ సింగ్. అణువిద్యుత్ కేంద్రంతో వచ్చే కాలుష్యం బెడద మాత్రం తప్పకుండా ఏర్పడుతుంది. ఇదీ మనం మార్చుకున్న జీవన విధానంతో వచ్చిన తిప్పలు. నగరమంటే నరకంగా తయారు చేస్తున్న పరిస్థితులు మన కళ్ళముందు నిలిచాయి. రోడ్డు విస్తరణతో కోల్పోయిన వేలాది చెట్లు నాటామా! లేదు. విశాలమైన రోడ్లు వేయించి, వాహనాలు అతివేగంగా నగరాలకు చేరాలి. ఇదే లక్ష్యం. ఇందుకోసం ప్రకృతి ఎంత ధ్వంసమైనా పరవాలేదు.
ఆ మితిమీరిన వేగమే ఇప్పుడు పాదాచారుల పాలిటి మృత్యువైంది. నగరవాసులకు నడిచేందుకు మార్గం లేదు. ఫుట్ పాత్ లు ఎప్పుడో మాయమయ్యాయి. ఫుట్ పాత్ ల స్థలం షాపులవారు ఆక్రమించుకున్నారు. జనం నడిచేందుకు రోడ్డు మధ్యకు వస్తున్నారు. రోడ్డు మీద వెళ్ళాల్సిన వాహనాలకు తగిన స్థలం కనిపించక ఆ వేగంలో నడిచేవారిని ఢీ కొంటున్నాయి.
హాయిగా ప్రకృతిధర్మంగా నడిచిన జీవన విధానంనుండి కృత్రిమ జీవన విధానంలోకి మళ్ళిన మనిషి నరికేసిన చెట్లు ఇప్పుడు నవ్వుకుంటున్నాయి. `నన్ను అడ్డు అని తొలగించుకున్నావు... నేను లేకుంటే సుఖంగా వుంటానని అనుకున్నావు... నిజంగా సుఖపడుతున్నావా?' అంటూ వెక్కిరిస్తున్నాయి. ఆ చెట్ల ఆత్మలు నగరంలో విహరిస్తూ నగర ప్రజల కష్టాలు చూసి నవ్వుకుంటున్నాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|