|
|
Articles: TP Features | కౌంటరేది? ఎన్ కౌంటరేది? - Site Administrator
| |
`శత్రువు' ఒక తప్పుచేస్తే `నేను' నాలుగు తప్పులు చేస్తానన్నట్టు మావోయిస్టుల ధోరణి ఉంటే అదే విధానాన్ని అనేక దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఉంటే వారి కార్యాచరణకు ఆదర్శప్రాయమైన లేబుల్ తగిలించి చూడడంలో ఏమాత్రం అర్థం-పర్ధం కనిపించడం లేదు.
`శత్రువు' హత్యలు చేస్తే నిలదీయడానికి సవాలక్ష మార్గాలున్నాయి. అందులో భాగంగానే ఇన్ని ఆందోళనలు, హర్తాళ్ళు, బంద్ లు, కేసులు కొనసాగుతున్నాయి. మరి మావోయిస్టులు హత్యలు చేస్తే నిలదీయడానికి మార్గాలు ఏమున్నాయి. అఖిల భారత హక్కుల సంఘాలు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘాలు ఇప్పటికైనా తెలియజేస్తే వారి నిజాయితీ ప్రపంచానికి తెలియవస్తుంది. చట్టాన్ని, న్యాయాన్నీ - ధర్మాన్నీ, మానవత్వంతో కలగలిపి చూస్తే పౌర హక్కుల నాయకుల సూచనల మేరకు ఆ మార్గాల్లో చట్టం తెలియని వారు పయనించే అవకాశముంది కదా?
బూటకపు ఎన్ కౌంటర్లలో పలానా సంవత్సరం ఇంత మంది మరణించారు, ఇంత మంది వికలాంగులయ్యారు, ఇన్ని కుటుంబాలు బజారున పడ్డాయి అని ఘోషిస్తున్నప్పుడు అదే సమయంలో మావోయిస్టుల కౌంటర్ల వల్ల ఎంత మంది అమాయక ప్రజలు నేలకొరిగారో జాబితా ప్రకటిస్తే ఎంతో హుందాగా ఉంటుంది? శత్రువు చేసింది `హత్య', `మనం' చేసింది `మిథ్య' అవుతుందా? ఏమిటి మావోయిస్టుల హత్యలకు కొలమానం?
మావోయిస్టుల ఈ బంద్ సందర్భంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో రోడ్డుకు అడ్డంగా వేసిన చెట్లను, వస్తువులను తొలగిస్తున్న పోలీసులపై దాడి చేసి మే 21న 16 మంది పోలీసులను మావోయిస్టులు మందుపాతర పేల్చి చంపారు. కాల్పులూ జరిపారు. (గత ఫిబ్రవరిలో ఇదే ప్రాంతంలో పేల్చిన మందుపాతరలో 15 మంది పోలీసులు మరణించారు.)
ఇది గెరిల్లా చర్య అవుతుందా?... లేక బూటకపు ఎన్ కౌంటర్ అవుతుందా?... మావోయిస్టులు - వారి సానుభూతిపరులైన మేధావులు, కవులు, కళాకారులు ప్రజలకు చెప్పాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|