|
|
Articles: TP Features | అలెగ్జాండరే కుమారస్వామి! - Site Administrator
| |
- జియస్ (ZEUS) కుమారుడు డయానీసస్ (DIONYSUS). శివుడి కుమారుడు స్కాంధ. జియస్ శబ్దం `శివ' శబ్దానికి రూపాంతరమే!
- జియస్ అంటే TRIOPHTHALMOS - మూడు కన్నులున్నవాడు. శివుడు త్రయంబకుడు, ముక్కంటి!
- ఈజిప్ట్ ల TUESDAY తమిళంలో చెవ్వ (CEVVA) వేదభాషలో DYAUS (దైవస్), గ్రీకు భాషలో ZEUS జియస్ గా మారింది. అనేక మంది గ్రీకు దేవతలు ఇలా హిందూ దేవతలుగా మారిపోయారు.
- అలెగ్జాండర్ ఇండియాని జయించిన తర్వాతే, స్కంధ భారతీయ సాహిత్యంలో కన్పించాడు. వైదికపరమైన సాహిత్యంలో స్కంధ లేడు. ఛాందోగ్యోపనిషత్తులో `స్కంధ-సనత్కుమా'రుడి పేరు కనిపిస్తుంది. అలెగ్జాండర్ కారణంగానే ఈ పేరు ఏర్పడింది.
ఇలా సాగుతుంది ఈ 40 పేజీల వ్యాసం. ద్రావిడ అనే పదం ఎక్కడ కన్పించినా దాన్ని `తమిళ' అనే పదంగా మార్చి చరిత్రను వక్రీకరించే ప్రయత్నంలో భాగంగా వండిన వ్యాసం ఇది! తల్లి ద్రావిడ భాషాకాలంలో జరిగిన చారిత్రకాంశాలన్నిటినీ ఈనాటి తమిళభాషకు ఆపాదింపచేయడం ఈ కుట్రలో ముఖ్యాంశం.
ద్రావిడ భాషల గురించి అధ్యయనం చేయటానికి ఎవరైనా విదేశీయులు భారతదేశానికి వస్తే, సహజంగానే మొదట మద్రాసులో దిగుతారు. అక్కడ తమిళ మేధావులు ఆయన్ని కమ్మేస్తారు. తమిళం ఒక్కటే ప్రాచీన భాష అనీ, తక్కిన ద్రావిడ భాషలన్నీ నిన్న మొన్న పుట్టినవని నూరిపోస్తారు. `తల్లి ద్రావిడ భాష' (PROTO DRAVIDA) తమిళభాషేననీ - తమిళంలోంచే తక్కిన ద్రావిడభాషలన్నీ పుట్టాయనీ నమ్మిస్తారు. ఈ చిలుక పలుకుల్నే పరిశోధకులు ప్రాజెక్ట్ రిపోర్టులుగా సమర్పిస్తారు. అవే సిద్ధాంతాలుగా, సిద్ధాంత గ్రంథాలుగా చెలామణి అవుతాయి. చాలా కాలంగా ఇలా సాగుతోంది పరిశోధనా విధానం.
సుసుము ఓనో అనే జపాన్ పండితుడు జపాన్ భాషలో తమిళపదాల గురించి సమర్పించిన పరిశోధనా పత్రంలో ఈ విషయాలన్నీ చక్కగా వివరించాడు. తెలుగుభాష వెయ్యేళ్ళ లోపుదేనని తమిళ పండితులు చెప్పడాన - జపాన్ భాషలో తెలుగుపదాల గురించి తాను పట్టించుకోలేదని కూడా ఆ వ్యాసంలో రాశాడు. భాషాశాస్త్రం తెలిసిన ఓ జపాన్ పండితుడు సుసుము ఓనోని మందలించి, హైదరాబాద్ లో ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి ఉంటారు - ఆయన్నడిగి అసలు సత్యం తెలుసుకోవలసిందిగా సూచించారు. ఈ సంగతిని ఉటంకిస్తూ తన పరిశోధనని ఈయనొక్కడే వేలెత్తి చూపించాడనీ, తమిళ మేధావులు ఎంతగానో మెచ్చుకున్నారనీ ఓనో తన వ్యాసంలో స్వయంగా పేర్కొన్నాడు. సుసుము ఓనో తనని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆచార్య భద్రిరాజు స్వయంగా విజయవాడలో ఓ సభలో పేర్కొన్నారు.
ఎవరో తమిళమేధావుల దాకా ఎందుకు? `తెలుగు కన్నా తమిళమే ముందు పుట్టినప్పటికీ...' అంటూ దీర్ఘం తీస్తూ, త్యాగరాజు తమిళుడైనా తెలుగుభాషకు సేవచేశాడంటూ, కన్నడిగుడైనా కృష్ణదేవరాయలు తెలుగు కవుల్ని ప్రోత్సహించాడంటూ మన జ్ఞానపీఠ గ్రహీత అయిన `పెద్దాయన' అనేక సభలలో ప్రకటిస్తుంటే మనందరం విన్నవాళ్ళమే!
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|