|
|
Articles: TP Features | గద్దర్ గురించి గోరంత... - Site Administrator
| |
విరాళాలు తీసుకోవడమే గాని ఇవ్వడం అలవాటు లేదన్నట్టుగా గద్దర్ ప్రవర్తిస్తే ఆయన మాటలకు, డిమాండ్లకు, మీడియా కబుర్లకు మాన్యత ఉంటుందా?
విద్య బ్రహ్మాండమైన వ్యాపారం. ఆ వ్యాపారంలో గద్దర్ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో సెటిల్ మెంట్లలోనూ చేతినిండా డబ్బు చూశారు. అంతేగాక ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు సంగీత విభావరులు నిర్వహిస్తే ఫీజు తీసుకున్నట్టు గద్దర్ తన సాంస్కృతిక కార్యక్రమాలకు, `ఫీజులు' తీసుకున్నారు. ప్రత్యేక టీవీ షోలు ఇచ్చి తాను డిమాండ్ చేసినంత పుచ్చుకున్నారు. తన కుమారుడికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పైరవీలతో ఉచితంగా మెడికల్ సీటు సంపాదించుకున్నారు. ఆ డబ్బు ఆదా అయ్యే ఉంటుంది. ఇంకా అనేక ఆదాయ మార్గాలు గల గద్దర్ ఒక నక్సలైట్ నాయకుడి వైద్య ఖర్చులకు గాను కొంత విరాళం ఇవ్వడానికి ఇబ్బంది ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. ఇచ్చే మనసు ఉండాలి తప్ప తృణమో పణమో విరాళంగా మెడికల్ బిల్లు పేర ఇచ్చేవారు. (కనీసం కొన్ని పళ్ళయినా ఆయన రాజన్నకు ఇచ్చిన దాఖలాలు లేవు). అలాంటిదేమీ లేకపోగా ప్రభుత్వమే ఖర్చునంతా భరించాలని డిమాండ్ చేసి వెంట గన్ మెన్ రాగా, పిస్తోలు ఉందో లేదో తడుముకుని, వాహనంలో కర్ర ఉందో లేదో పరిశీలించి, రక్షణ వలయం అలర్ట్ గా ఉందా?... లేదా అని వీక్షించి కారులో తుర్రుమన్నారు.
ప్రభుత్వం తనను చంపడానికి కుట్ర పన్నుతోందని చాలా కాలంగా ఆరోపిస్తూ ప్రభుత్వ గన్ మన్ ను కోరడం, ప్రభుత్వ పిస్తోల్ లైసెన్సు పొందడం వింతగా వినిపించే మాటలు. పూర్తిగా `పార డాక్స్' విషయమిది. ఎవరితో ప్రాణభయముందో వారి బంటు మెషిన్ గన్ తో వెంట తిరగడం ఎంతటి కాంట్రాస్టు విషయమో ఎవరికి వారే ఆలోచించుకోవాలి.
| Read 7 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|