|
|
Articles: TP Features | ఆరిన జ్వాల నక్సల్ బరీ - Site Administrator
| |
అప్పుడు యునైటడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోని మంత్రుల బృందం నక్సల్ బరీ ప్రాంతాన్ని సందర్శించింది. కొన్ని భూ సంస్కరణలను ప్రతిపాదించింది. చివరకు 1967 జూలై 5 వ తేదీన ఒక ప్రణాళిక అమలు చేయడానికి అంగీకారం కుదిరింది. సాయుధ పోరాట నాయకులను లొంగిపోవాలని ప్రభుత్వం కోరింది. ఆగస్టు నెలాఖరుకల్లా వేలాది మంది సాయుధపోరాట యోధులు అరెస్టయ్యారు. కానూ సన్యాల్, చారు ముజుందార్, విశ్వనాథ్ ముఖర్జీ లాంటి ముఖ్య నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పశ్చిమ దినాజ్ పూర్, జల్పాయిగురి లాంటి చుట్టుపక్కల జిల్లాల్లో తలదాచుకున్నారు.
రెండేళ్ళ తరువాత... 1969 మేడే రోజున...కోల్ కతాలోని ఆక్టర్ లూనీ స్మారక చిహ్నం దగ్గర జరిగిన అతిపెద్ద మేడే ర్యాలీలో కానూ సన్యాల్ చరిత్రాత్మక ప్రకటన చేశారు. అదే దేశంలో మూడో వామపక్ష పార్టీ సిపిఐ(ఎంఎల్)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు (దీనినే ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పేరు మార్చారు). అగ్రగామి నేతగా, సిద్ధాంతకర్తగా నక్సలైట్లు ఆరాధించే కానూ సన్యాల్ ఇంకా బతికే ఉన్నారు. నక్సల్ బరీ గ్రామంలో ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. ఏడాది క్రితం సన్యాల్ పక్షవాతానికి గురయ్యారు. జ్ఞాపకాల పొరలను చీల్చుకుంటూ ఆయన ఇలా చెప్పారు. `సిపిఐ(ఎంఎల్) ఏర్పాటు చేయడానికి ముందే నాకు చారు ముంజుందార్ తో తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రజలను చంపడం అనే సిద్ధాంతాన్ని ఆయన అనుసరించారు. నేను దానికి విరుద్ధం. అదే విభేదం. నేను అంతకు నెల రోజుల ముందే జైలు నుంచి విడుదల అయ్యాను. ఒక రోజు నన్ను హఠాత్తుగా పిలిచి కోల్ కతా వెళ్ళి పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయమన్నారు. కామ్రేడ్ సరోజ్ దత్తా, మరి కొంతమంది తయారుచేసి ఇచ్చిన ప్రకటనను మాత్రం నేను చదివాను' అని ఆయన వివరించారు.
ఉవ్వెత్తున రగిలిన ఈ మంటలు 1960-70 సంవత్సరాల మధ్యకాలంలో బెంగాల్ అంతా వ్యాపించాయి. గ్రామీణ రైతుల కోసం సాగిన ఈ ఉద్యమానికి కోల్ కతా నగరంలో కూడా అద్భుతమైన మద్దతు లభించింది. అంతకు ముందు గానీ, తరువాత గానీ ఏ ఉద్యమానికీ ఇలాంటి అభిమానం లభించలేదు. సిర్ధార్ద్ శంకర్ రే నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అణచివేతతో ఈ మంటలు చల్లారి పోయాయి. 1977లో వామపక్ష కూటమి బెంగాల్ లో అధికారంలోకి రావడంతో అనేక మంది నక్సల్స్ జైళ్ళ నుండి విముక్తి పొందారు.` కానీ చాలా మంది భావిస్తున్నట్లుగా వామపక్ష ప్రభుత్వం మమ్మల్నేమీ కరుణించలేదు. మమ్మల్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్ జైళ్ళలో నిర్బంధించారు. మేము ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో న్యాయ పోరాటం చేసి మా స్వాతంత్ర్యాన్ని గెలుచుకున్నామ'ని కానూ సన్యాల్ స్పష్టం చేశారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|