|
|
Articles: TP Features | `మెగా'కు కోటరీయే దగా - Site Administrator
| |
ఆ కోటరీ ఆయన పక్కన ఉన్నంత కాలం అంతే. ప్రజారాజ్యం ఇంకా రాజకీయపార్టీగా మారలేదు. అది రావడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేను. నేను పార్టీకి నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ చెబుతున్నా. చిరంజీవిలో మార్పు రావాలని కోరుతున్నా, కుటుంబ పార్టీ ముద్ర పోవాలని చెబుతున్నా. నన్ను పార్టీ మారాలంటూ కార్యకర్తలంతా ఒత్తిడి చేస్తున్నారు. నేను ప్రభుత్వంలో ఉన్నత స్ధానంలో పనిచేశా. ఎంపిగా చేశా. రాజకీయ పార్టీలలో బిసి, దళితులకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో ఈ వయసులో కూడా పోరాడుతున్నా. నన్ను పార్టీ మారాలని కార్యకర్తలంతా చాలాకాలం నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ఆరు నెలల్లో ఓ నిర్ణయం తీసుకుంటా’నని మూర్తి చెప్పారు.
ఉన్న పార్టీలో భవిష్యత్తు లేదంటే తప్పకుండా వెళ్లిపోతారని మూర్తి అభిప్రాయపడ్డారు. దేవేందర్ గౌడయినా, తమ్మినేని సీతారామయినా, కళా వెంకట్రావయినా పాత పార్టీలకు వెళ్లడం సహజమని ఆయన చెప్పారు. అందుకు వాళ్లను తప్పు పట్టవలసిన అవసరం లేదని, రాజకీయ నిర్మాణం, వ్యవస్థ లేని పార్టీల్లో రాజకీయ నాయకులు ఎంతోకాలం ఉండరని ఆయన చెప్పారు. అయినా పార్టీ నుంచి వెళుతున్న వారిని ఎందుకు వెళుతున్నారని బుజ్జగించేవారు లేరని, అసంతృప్తి అన్ని స్థాయిల్లోనూ ఉందని మూర్తి వెల్లడించారు. పవన్‌కల్యాణ్, నాగబాబు ఆఫీసుకు ఎందుకు రావడం లేదని అడిగితే ఏం చెబుతాం, వాళ్లకు అల్లు అరవింద్‌తో పడటంలేదని వివరించారు. ప్రజారాజ్యం పార్టీ నాలుగుకాలాల పాటు ఉండాలా? లేదా అన్నది చిరంజీవి తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందన్నది మూర్తి ముక్తాయింపు!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|