|
|
Articles: TP Features | గ్రహణాన్ని చూడొచ్చు - Site Administrator
| |
సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు. సూర్యచంద్రులు ఈ విశ్వవిరాట్పురుషునికి రెండుకళ్ళు అని పురాణాలు ఘోషించి చెబుతన్నాయి. గ్రహణం పేరుతో ఏ గ్రహణం చీకటిపాలైనా అది విరాట్పురుషినికి బాధే కదా అని భక్తులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా ఉవాసం ఉంటారు. తరచూ గ్రహణాలు సంభవిస్తున్నాయంటే అందుకు కారణం రాహు, కేతువుల తలలు సజీవంగా ఉండడమేనంటాయి పురాణాలు. గ్రహణానంతరం దుష్టగ్రహపీడ తప్పి క్షేమంగా సూర్యుడు లేదా చంద్రుడు బైటపడినందుకు మైలస్నానం చేసి తిరిగి పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం నదీ తీరానికో, సముద్ర తీరానికో వెళతారు. మంత్రజలాన్ని అన్ని వస్తువుల మీద, తినుభండారాలమీదా జల్లుతారు. గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని, తింటే కడుపునొప్పి వస్తుందని చెబుతారు. దేవుడు మైలపడిపోతాడని, దేవాలయాలను గ్రహణ సమయంలో మూసేసి ఆలాయాలను వేదమంత్రాలతో శుద్ధిచేశాక తిరిగి తెరిచి పూజాధికాలను యథాప్రకారం జరిపిస్తారు. ఇది సెంటిమెంట్ రీత్యా మనం చేస్తున్న పని. కానీ గ్రహణ విషయంలో సైన్స్ చెబుతున్న కారణాలు వేరుగా ఉన్నాయి.
ఆకాశంలో ఏ ఆలంబనా లేకుండా తిరిగే గ్రహాలు గుండ్రంగా ఉంటాయి. ఇవి ఒక పరిమితికి లోబడి ఒక స్థిరకక్షలో ఉంటూ పరభ్రమిస్తుంటాయి. భూమికి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే గుణం ఉంది. సూర్యుడు చుట్టూ పరిభ్రమించే గ్రహాలలో చంద్రుడు కూడా ఉన్నాడు. ఈ చంద్రుడు భూమికి సూర్యుడికి నడుమ వస్తే సూర్యగ్రహణం వస్తుంది. అలాగే సూర్యుడికి, చంద్రుడికి నడుమ భూమి వెళ్తే చంద్రగ్రహణం వస్తుంది. ఆకాశంలో ఉండే ఈ గోళాలన్నీ గుండ్రంగా ఉంటాయని దుర్భిణులు వేసుకు చూసిన శాస్త్రవేత్తలు చెబుతుంటే నిన్నమొన్నటిదాకా ప్రజలు నమ్మలేకపోయారు. సూర్యుడు, చంద్రుడు మన కళ్ళకు కనబడే వారే కనుక అవి గుండ్రంగా ఉన్నాయంటే విస్తుపోవడానికి ఏమీ లేదు. కాని మనం నివసించే భూమి సంగతే మనకు తెలియదు. దాని బాహ్యరూపం కంటితో చూసే అవకాశం లేదు. అందుకే పురాణాలలో మకుటాయమానంగా భావించే భాగవతంలో హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా చుట్టి భుజాన వేసుకు మోసుకుపోయాడని వాడిని అడ్డగించేందుకు హరి వరాహావతారం ఎత్తడాన్న కథ కనబడుతుంది. దీంతో భూమి ఆకారం వివాదగ్రస్తంగా మిగిలింది.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|