|
|
Articles: TP Features | తల్లిని విస్మరిస్తే అంతే మరి! - Site Administrator
| |
ఇలా ఉండగా, గత యుపిఎ ప్రభుత్వం జరిపిన చిట్టచివరి మంత్రిమండలి సమావేశంలో కన్నడానికి తెలుగుకు ఇచ్చిన ప్రాచీన భాషా ప్రతిపత్తిని ఆమోదించింది. దీని ప్రకారం మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థల్లో కన్నడ క్లాసికల్ భాషకు సంబంధించిన అత్యున్నత అధ్యయన కేంద్రాన్ని ఏర్పరుస్తున్నట్లు పత్రికలలో వెలువడింది. తెలుగు సంగతి ఏమయిందో తెలియదు. పట్టించుకునే నాధుడు లేడు. తమిళనాడు ప్రభుత్వం తమ క్లాసికల్ భాషా కేంద్రాన్ని పట్టుబట్టి చెన్నపురిలో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. మనం మాత్రం గుడ్లప్పగించి చూస్తూ ఉందాం.
అయితే, అన్నీ సజావుగా జరిగితే తెలుగుకు ఒరిగేదేమిటి అని ప్రశ్నించేవారూ ఎప్పుడూ ఉన్నారు. మనం తినేదే ప్రశ్నల్ని కదా! ఏ మాత్రం మనకు కూడా కొన్ని కోట్లు వస్తాయని తెలియగానే నిజంగా దీని కోసం ప్రామాణిక ప్రయత్నాలు చేసేవారిని, నిజమైన పండితుల్ని, పరిశోధకుల్ని వెనక్కి నెట్టేసి దొంగ పండితులు, పరిశోధకులు పరుగు ప్రారంభిస్తారు. అలాంటి వారి చేతిలో తెలుగు స్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మన రాజకీయ నాయకుల చేతిలో అలాంటివారు భద్రంగానే ఉంటారు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|