|
|
Articles: My Thoughts | అబ్బూరి వారి చాటువులు - Site Administrator
| |
'ఆ శైలి లోనే అతివాస్తవికా గ్రేసరు
లతులిత శబ్ధ ప్రయోజాతీతులు
పండిత బీరులు మరి కొందరు
మతిచెడి విహరించు చుంద్రు మహిలో శ్రీ శ్రీ' ... ఇక అప్పట్లో మైలవరం కంపెనీ వారి చిత్ర నళినీయం నాటకంలో 'అల్లము మస్తాన్' అనే వ్యక్తి దమయంతి వేషం వేశారట. దాన్ని చమత్కరిస్తూ 'దమయంతీ సతి కృత్రిమ స్తనము లందంబేది' అంటూ చమత్కరించారట. మరి స్టాలిను గురించి ఒక చాటువులో 'ఉన్నాడో లేడో శ్రీమన్నారాయణుడు / కానివారికి స్టా...లిన్నే భగవంతుడట' విన్నావా ముళ్ళ పూడి వెంకట రమణా. ఇక పోతే 'స్త్రీలను పున్నమి చందమామ'తో పోల్చి చెప్పడం గురించి...
'పున్నమి జాబిలి మోమని
అన్నుల మిన్నులను పోల్చుటనుచిత మట
నేడన్నీ రాళ్ళూ రప్పలె' విన్నావా ముళ్ళ పూడి' ... అదేవిధం గా కన్నెలు ప్రౌఢ కాంతల శృంగారాలపై 'వన్నిదములేల నీతో
కన్నె వలపు కన్న ప్రౌఢ కాంతల వలపె సున్నితపు మరులు గొల్పును' విన్నావా ముళ్ళపూడి.
ఇంకా చెప్పాలంటే ఒకసారి విశ్వ విద్యాలయంలో మంచినీటి కరువు తాండ వించిందట. అప్పుడు 'భూమి మీద లేవు భూగర్భమున లేవు మింట లేవు వీసీ యింట లేవు... చచ్చి పోయినావో శంభో మహాదేవ ఎటకు పోవు రామ కృష్ణ రావు' అంటూ శ్రీనాధుడు గంగను వదలమంటే అబ్బూరి ఎక్కడకు పోవాలి? అని చాటువు గా ప్రశ్నించారట. ఇక చివరి గా 'చావు పుట్టుకల మీద...'
'ఉన్నామని సంతోషము
సున్నా ఇక చావుమటుకు సుఖమా అంటే
అన్నీ సందేహాలే మరి' ... విన్నావా ముళ్ళపూడి అంటూ జీవితం లోను సంతోషంలేదు పోనీ చచ్చి సుఖ పడదామంటే అక్కడ సుఖముందో లేదో తెలియదు. అని ఎన్నో సాహితీ మధురిమలు అందించిన అబ్బూరి వారి ఘనత శ్లాఘనీయం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|