|
|
Articles: TP Features | మార్పంటే ఇదే! - Site Administrator
| |
సరే ఇవన్నీ ఒక ఎత్తు, ఒక పార్శ్వం. సమాజంలో కూడా తగినన్ని మార్పులు రావాలి కదా. మమ్మల్ని ఇతరులు తమతో మెలగనీయాలి కదా. ఆ సమాజంతో కలవనీయాలి కదా. స్వీకరించాలి కదా... అవును. ఆ దిశగా కూడా ఈ ఎన్జీవో కృషిచేస్తూ ఉంటుంది. సమావేశాలు, కలయికలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆ సందర్భంగానే వీరిని న్యూయార్క్ తీసుకొని వెళ్ళింది. దానికి ముందు న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ లో జరిగే 'ఫ్యాషన్ షో'కి వీరందరూ వెళ్ళి పాల్గొన్నారు. అబ్దుల్ హల్దార్ వీరికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. వీరు రకరకాల దుస్తులు కుట్టడం నేర్చుకున్నారు. అంతేకాదు, అలాటి దుస్తులు వేసుకుని గొప్పగొప్ప ఇండియన్ మోడల్ అమ్మాయిలతో కలిసి ప్రదర్శనలు ఇచ్చి స్టేజీని అలంకరించారు, ర్యాంప్ మీద నడిచారు. వీరిలో చెప్పుకోదగిన మోడల్ అమ్మాయిలు మేర్ రాబిన్ సన్, ఇంద్రాణి దాస్ గుప్తా, తపూర్ ఛటర్జీ వంటివారు. ఇక్కడే విశేషం ఒకటి జరిగింది.
నెదర్లాండ్ రాజు ప్రిన్స్ ఆఫ్ ఆరంజి ఈ ప్రదర్శనను తిలకించిన ప్రముఖులలో ఒకరు. అంతే. అతను వీరిని యునైటెడ్ నేషన్స్ కి ఆహ్వానించాడు. సులభ్ ఇంటర్నేషనల్ ఈ ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది. ఇంకా ఇతర అంతర్జాతీయ సంఘాలు కూడా దీనికి సహాయం అందించాయి. 'ఇలాంటిది జరుగుతుందని కలలోనైనా ఊహించలేదు, అసలు విషయం న్యూయార్క్ లో మాకు జరిగిన సన్మానాలు, గౌరవాలు తలుచుకోను కూడా తలచుకోలేం' అంటారు ఉష. ఆమె అంతర్జాతీయ సభలో పోడియమ్ వద్ద నుంచి సభికులనుద్దేశించి ప్రసంగించారు. అప్పుడు తమ చరిత్రను ఒకసారి నెమరువేసుకొని అందరితో తమ అనుభవాల విశేషాలను పంచుకొన్నారు. 'ఎంత హీనమైన పనిని చేస్తూ ఉండేవారమో కదా. ఈ సులభ్ ఇంటర్నేషనల్ ఎలాంటి సహాయం చేసిందో విలువ కట్టగలమా. ఈ నీచాతినీచమైన అవమానకరమైన వృత్తి నుంచి విముక్తి కల్గించింది' అని చెప్తూ వారికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కదా, ఎలా వారి రుణం తీర్చుకోగలమో కదా అంది. ఇక తనే తన కుటుంబ పోషణభారం వహిస్తున్నాను అని చెప్పింది. ఇంతకీ ఆమె ఉపన్యాసం విన్నది ఎవరూ? యునైటెడ్ నేషన్స్ లోని ఉన్నత ఉద్యోగులు, ప్రపంచ రాజకీయ వేత్తలు, ఇతరులు. ఆ తరువాత ఆమెకు వారి బృందానికి రాణి అని కిరీటం పెట్టారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|