TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
సరళ
- Site Administrator
< < Previous   Page: 3 of 4   Next > >  
కూతురు గురించి.. 'మరి గీ సరళ పోరి గూడా మన కడుపుల పుట్టిందే గదా! ఏడో తరగతిలుండగనే పెద్దమనిషాయె. సదువాగిపాయె. ఇంకా రెండు మూడేండ్లన్నా సదివించకపోతిమి. ఆడపోరిని ఇంకో ఊర్లె సదివించాలంటే మనసొప్పకపాయె. ఇప్పుడు దానికి పద్దెనిమిదేండ్లు దాటిపాయె. దాని పెండ్లి ఎట్లా జేస్తవ్?' భార్య బాధ్యత గుర్తు చేసింది. సన్యాసి లెక్క నవ్వి 'అంతా ఆ పరమాత్ముని దయ' అని చేతులెత్తి దండం బెట్టిండు. అంతా విన్న సరళ 'ఇది వెనుకటి జమానా కాదు. నా పెండ్లి గురించి తొందర లేదు. మీరు ఫికర్ చెయ్యొద్దు' సముదాయించింది. లోపలి నుండి సరళ, సావిత్రిల ఏడుపు వినబడుతోంది. అరుగు మీది పెద్దమనిషి చుట్టపొగ పీలుస్తున్నడు. 'మరి.. బొందయ్యకు బొంద ఎవలో ఒకలు తోడాలె గదా!' విసుక్కుంటూ గుర్తు చేసిండు. మొగవాళ్ళు మొహాలు చూసుకుంటున్నరు. ఏదో కొత్త సంగతి విన్నట్టు కొందరు ఆశ్చర్యపోతున్నారు. 'మనూర్లె బొందయ్య తప్ప ఇంకా ఎవలన్నా బొంద దోడిండ్రా?' రుమాలు దులుపుకుని భుజమ్మీదేసుకుంటూ అడిగిండో నడివయసాయన. 'నిజమే కాని వాడు సచ్చిపాయె. ఇప్పుడు ఎవలన్నా తోడక తప్పదు గదా!' నువ్వంటే నువ్వనుకుంటున్నారు. కీచులాడుకుంటున్నారు. గీ పని నాకు రాదు. అందరి నోట అదేమాట. 'ఓర్నియవ్వ గిదేందిరో!?' అంతా గమనిస్తున్న ఓ ముసలమ్మ ఝాడింపుకు దిగింది. ఏదన్నా నౌకరి ఉన్నదంటే పాంటు, బుస్కోటేసుకుని పదుల మంది వైసుపోరలు ఉరికొస్తరు. తాత ముత్తాతలు చేసిన బ్యాగరి పని చెయ్యమంటే ఛస్తరు. ధూ.. నీయమ్మ... దునియా అంత గిట్లనే ఉన్నదా?' యువ కిశోరాలకు నవ్వొచ్చింది గానీ, పౌరుషం రాలేదు. నాలుగైదు నిమిషాలు మొఖాలు చూసుకున్నారు. మరిప్పుడెట్లా? పెద్దమనిషి పరేశానైపోతున్నడు. 'మన కులపోల్లంతా బొందలు తోడాలె. ఎవ్వలూ తోడకపోయిరి. ఒక్క బొందయ్య తోడె. వాని కొడుకేమో కొండంత చదువు జదివి రెక్కలొచ్చి ఎగిరిపాయె. మన కులాచారం కుక్కల పాలాయె' గుండెల మీద గుండుసూదులు గుచ్చుకున్నట్టుంది. 'అరేయ్! గీ వైసు పిల్లగాండ్లెవలన్నా తోడుండ్రిరా. నా వయసోల్ల నడుములు కూలవడిపాయె. రెక్కలు మూలకుపడె. కిరికిరి ఎందుకురా జెల్ది వొయ్యి తోడుండ్రి బిడ్డా' బతిమాలిండు. అయోమయంగా ముఖాలు చూసుకున్నరు యువకులు. కళ్ళతో సైగలు జేసుకున్నారు. 'గా పని మాకు రాదని ముందే చెప్పినంగదనే పెద్దమనిషీ! మల్లా మా తెరువొస్తే మర్యాదగుండది' అందరి తరఫున ఒక్కరి వార్నింగ్. పెద్దమనిషిలో ఆశ చావలేదు. అతని చూపు ప్రౌఢులను తడుముతున్నై. బేజారైంది ప్రౌఢులకు. 'నువ్వు గట్ల జూస్తే మాకు భయమైతదే పెద్దమనిషీ' ఓ ప్రౌఢ శిఖామణి పౌరుషం. నీ బుద్ధి బొందలవడంగా బొంద దోడుడు మాతో నైతదా? కానే కాదు' తెగేసి చెప్పి కాండ్రించి ఉమ్మేసిండు. ఆడవాళ్లు గొల్లుమన్నరు. శవాన్ని జాలిగా చూస్తున్నరు. 'ఎందరికో బొందలు తోడితివయ్యా. నీకు బొందలు ఎవలు తోడుతరయ్యా..' సావిత్రి పొత్తికడుపులో సప్త సముద్రాలు పొంగుతున్నై, భర్త శవమ్మీద వాలి శోకాలు దీసింది. 'పీనుగు వాసన వడ్తుంది. జెల్ది కానియ్యిండ్రి' ఓ ముసలమ్మ ముక్కు మూసుకుంది. అంతవరకూ సరళ పక్కనే ఉన్న యువతి బయటికొస్తూ... 'గీ మొగోల్లు, మొనగాల్లంతా ఏంజేస్తున్నరు? బొంద దోడుడు అదేమన్నా బ్రమ్మవిద్యనా?' కవ్వింపుగా చూసింది. 'గడ్డపార, పార, తట్ట వట్టుకుని బొందలగడ్డకు వోతే అక్కడనే తెలుస్తదంత' వయసు పొంగుల మీది కొంగును సవిరించుకుంది. 'గట్లనంగనే గిట్ల పనైతదా?' మరో యువకునికి రోషం ఇంజెక్షనిచ్చినట్టయింది.' డిగ్రీలు చదువుకున్న మేము బొందలు తోడెటందుకే పనికొస్తమా? సవాలు విసిరిండు.

Read 1 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 3 of 4   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.