|
|
Articles: TP Features | కొత్త సిఎంపై ఆచి తూచి... - Site Administrator
| |
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన వయసు, అనుభవ రాహిత్యం అడ్డంకి అని విమర్శించే వారికి ఆయన అనుచరులు మా యువ నాయకుడికి వయసు తక్కువే కావచ్చు గాని రాజకీయానుభవానికి కొదవే లేదంటున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచీ జగన్ రాజకీయ వాతావరణంలోనే మసులుతున్నాడని, నాలుగైదు ఎన్నికలలో ప్రత్యక్షంగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉందంటున్నారు. ముఖ్యమంత్రి తనయుడిగా గత ఐదు సంవత్సరాలు అధికార పీఠానికి దగ్గరగా ఉన్న ఇంటర్న్ షిప్ చేసిన అనుభవం ఉంది. ఆయన వయసు తక్కువే కావచ్చు గానీ సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి అని సమర్ధిస్తున్నారు.
మొన్నటి ఎన్నికలలో ఎంపీగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ సాధించి సత్తా నిరూపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పి.వి.నర్సింహారావు, కేశవరావు, వెంకయ్యనాయుడు లాంటి పెద్ద నాయకులకు ఇలాంటి అర్హత ఏమీ లేకుండానే అత్యంత ఉన్నత పదవులు పొందలేదా అన్నది జగన్మోహన్ రెడ్డి అనుయాయుల ప్రశ్నగా ఉంది. మరో వైపున వారంతా జిల్లా్లలో ధర్నాలు, ప్రదర్శనలు, పిసిసి అధ్యక్షుడి ఇంటి ముందు ధర్నా చేయడం లాంటి కాంగ్రెస్ మార్క్ కార్యక్రమాలను చేస్తున్నారు.
ఈ విషయం పక్కన పెడితే కుటుంబపాలన, వారసత్వ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి ప్రతీక అవుతాడంటూ వస్తున్న విమర్శలకు ఆయన అనుయాయులు, మద్దతుదారులు సహేతుకంగానే వివరణ ఇస్తున్నారు. మన దేశంలో కుటుంబపాలనకు ప్రజానుమతి ఉంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆ మాటకొస్తే సోనియా, రాహుల్ గాంధీ ఇలా వచ్చిన వారే కదా అని వారంటున్నారు. రాజకీయ రంగంలోనే కాదు సృజన అవసరమున్న సినిమారంగం తెలివితేటలు అవసరం ఉన్న పాలనారంగంలో (జడ్జీలు, లాయర్లు, ఐ.ఏ.ఎస్) కూడా వారసత్వం, కుటుంబపాలన ఉంటున్నది. పారిశ్రామిక సంస్థలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర సంస్థలు కూడా కుటుంబాల చేతులలోనే వారసత్వంగా నడుస్తున్నాయని వారంటున్నారు. నామినేషన్ పద్ధతిలో ఉన్నత పదవులు పొందితే విమర్శించాలి కాని మెజార్టీ శాసనసభ్యులు కోరుకుంటున్నప్పుడు అభ్యంతరాలు ఎందుకు ఉండాలని వారంటున్నారు. ఎమ్మెల్యే చనిపోతే ఆయన భార్యనో, కొడుకునో ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా చేయడం లేదా! ముఖ్యమంత్రి కొడుకును ముఖ్యమంత్రిని చేస్తే ఇబ్బంది ఏముందని వైఎస్ జగన్ మద్దతుదార్లు అంటున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|