|
|
Articles: My Thoughts | పత్రికల పుట్టుక-పరిణామం - Site Administrator
| |
1920లో మొసలికంటి రాంబాయమ్మ కాకినాడ 'హిందూ సుందరి' పత్రికను, 1910-18సంవత్సరాల మధ్య కాలంలో పులగుర్తి లక్ష్మీనరసమాంబ 'సావిత్రి' పత్రికను, 1914 లో వింజమూరి వెంకటరత్నమ్మ 'అనసూయ' వంటి పత్రికలను స్త్రీలు సైతం నడిపించినారు. 20వ శతాబ్ది సంస్కరణోద్యమంలో చిలకమర్తి వారి 'మనోరమ' (1905) దేశమాత (1910) పత్రికలు సంఘసంస్కరణకు, జాతీయ భావ ప్రబోధానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. గిడుగు రామ్మూర్తి పంతులుగారి వ్యవహారిక భాషావాదానికి 'వెలుగు' పత్రిక ఎంతో సహాయపడింది. కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారి విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి నాటి తెలుగు సారస్వత ప్రగతికి ఎంతోగానో కృషి చేసింది. సాంస్కృతిక భాషా పునరుజ్జీవనోద్యమాన్ని ప్రతిఘటించిన ఛాందసవాదులలో కొక్కొండ వెంకటరత్నం మద్రాసు నుండి 'హాస్య వర్ధిని' శ్రీపాద కృష్ణమూర్తి కాకినాడ 'వజ్రాయుధం', కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి 'ఆంధ్ర సాహిత్య పరిషత్' వంటి పత్రికను నడిపి తిరోగమన వాదులుగా ముద్రపడినారు.
1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన తర్వాత 'కేసరి, మరాఠీ' పత్రికల ద్వారా తిలక్ పోరాటం జరుపగా అదే బాటలో 'స్వరాజ్య' పత్రికలో సంపాదకుడిగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1908లో 'అరెరె! ఫిరంగి, క్రూర వ్యాఘ్రమా!' అనే వ్యాసం రాసి బ్రిటీష్ వారి కోపానికి గురై రాజద్రోహి నేరం క్రింద 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్రదేశంలో ఈ శిక్షననుభవించిన తొలి సంపాదకుడు ఇతడే. 1907-08 రాజమండ్రి నుంచి చిలుకూరి వీరభద్రరావు 'ఆంధ్రకేసరి'ని బందరు నుండి చిల్లరిగె శ్రీనివాసరావు 'నవయుగ' పత్రికలు నడిపారు. జాతీయోద్యమ ధృవతారలుగా పేర్కొనబడిన పత్రికలు 'కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక'. 1902లో ఫిబ్రవరి 1న బందరులో కొండా వెంకటప్పయ్య, దాసు నారాయణరావులు కృష్ణాపత్రికను ప్రారంభించారు. 1907లో ముట్నూరి కృష్ణారావు ఈ పత్రికలో చేరి సుమారు 4 దశాబ్దాలపాటు సంపాదకుడిగా పనిచేసి స్వతంత్రోద్యమంలో, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో అఖండ కృషి చేసినారు. అలాగే వివేకవర్ధిని ప్రభావానికి గురైన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు 1908 సెప్టెంబర్ 9న బొంబాయిలో ఆంధ్రపత్రికను వారపత్రికగా స్థాపించారు. 1914లో దాన్ని మద్రాసుకు తరలించి దినపత్రికగా మార్చారు. నిస్వార్ధంగా, లాభాపేక్షలేని ఈ రెండు దినపత్రికలు చేసిన సేవ తెలుగు పత్రికారంగంలో చిరస్మరణీయమైంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|