|
|
Articles: Devotion | సాయి నక్షత్ర మాలిక - Site Administrator
| |
అందరిలోనూ ఒదిగితివీ - ఆకాశానికి ఎదిగితివీ
దుష్టజనావళిని మార్చితివీ - శిష్టకోటి లో చేర్చితివీ
మహల్సా ఒడిలో కొరిగితివీ - ప్రాణాలను విడనాడితివీ
మూడు దినములకు లేచితివీ - మృత్యుంజయుడనిపించితివీ
కాళ్ళకు గజ్జెలు కట్టితివీ - లయ బద్ధముగా ఆడితివీ
మధుర గళముతో పాడితివీ - మహదానందము కూర్చితివీ
అహంకారమును తెగడితివీ - నానావల్లిని పొగడితివీ
మానవ సేవా చేసితివీ - మహనీయుడవనిపించితివీ
దామూ భక్తిని మెచ్చితివీ - సంతానమునూ యిచ్చితివీ
దాసగణుని కరుణించితివీ - గంగా యమునలు చూపితివీ
పరిప్రశ్నను వివరించితివీ - నానాహృది కదిలించితివీ
దీక్షితుని పరీక్షించితివీ - గురుభక్తిని యిల చాటితివీ
చేతిని తెడ్డుగ త్రిప్పితివీ - కమ్మని వంటలు చేసితివీ
ఆర్గజనావళిని పిలిచితివీ - ఆకలి బాధను తీర్చితివీ
మతమును మార్చితే కసిరితివీ - మతమే తండ్రని తెలిపితివీ
సకల భూతదయ చూపితివీ - 'సాయి మాత' గా అలరితివీ
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|